Gudur: అంగన్వాడీ, రేషన్ షాపుల్లో ఫుడ్ కమీషన్ ఛైర్మన్ మెరుపు తనిఖీలు!

Gudur: గూడూరులోని అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ షాపుల్లో ఫుడ్ కమీషన్ ఛైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి తనిఖీలు చేశారు.

C. Ganesh, Kodumuru
Published on: 1 July 2026 3:24 PM IST
Gudur:
X

Gudur: అంగన్వాడీ, రేషన్ షాపుల్లో ఫుడ్ కమీషన్ ఛైర్మన్ మెరుపు తనిఖీలు!

Gudur: ఫుడ్ కమీషన్ ఛైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి పర్యటన

గూడూరు పట్టణంలోని అంగన్వాడీ సెంటర్లను,రేషన్ దుకాణాలు , హై స్కూల్ ను ఫుడ్ కమీషన్ ఛైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి తనిఖీ చేశారు.

అంగన్వాడీ కేంద్రాలలో పాడైపోయిన గుడ్లు ఆయిల్ వున్నట్లు గుర్తించారు.

భోజనాన్ని రుచి చూసి..నాణ్యత లేదంటూ అంగన్వాడీ నిర్వాహకులపై మండిపడ్డారు.

భోగస్ అటెండెన్స్ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తు అంగన్వాడీ - 3 సెంటర్ ను సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.రేషన్ దుకాణాలలో బియ్యం నాణ్యత లేదంటూ లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు.

ఈ తనిఖీలో జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ రాజా గోపాల్, జిల్లా అధికారులు,మండల తహసీల్దార్ వెంకటేష్ నాయక్ , తదితరులు పాల్గొనారు.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru

Next Story