Nellore: అవినీతిపై పోరాడకుంటే భవిష్యత్తు శూన్యం మేకపాటి విక్రమ్ రెడ్డి

Nellore: అభివృద్ధి పేరుతో ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేస్తోందని, సాగునీటి ప్రాజెక్టులను విస్మరిస్తోందని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి విమర్శించారు.

V. Narasimhulu, Nellore
Published on: 6 May 2026 10:37 AM IST
Nellore
X

Nellore: అవినీతిపై పోరాడకుంటే భవిష్యత్తు శూన్యం మేకపాటి విక్రమ్ రెడ్డి

నెల్లూరు: అమరావతి అభివృద్ది పేరుతో ప్రభుత్వం అసమాన ఖర్చులు చేస్తుందని, అవినీతిపై ప్రశ్నించకుంటే మన పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని, అదే విధంగా వేల ఎకరాల సాగు కోసం లక్షల మంది రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టులు పూర్తి చేసేలా ప్రభుత్వంతో అందరం కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నెల్లూరు ఆర్ఎస్ఎన్ కళ్యాణ మండపంలో మంగళవారం జరిగిన రాయలసీమ ఎత్తిపోతల పథకం భవిష్యత్తు కార్యాచరణపై రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.....

జిల్లా జలనిధి సోమశిల జలాశయం ఆత్మకూరు నియోజకవర్గంలోనే ఉన్నా ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో నీటిని అందుకోలేకపోతున్నారని, ముఖ్యంగా మర్రిపాడు మండలంతో పాటు ఉదయగిరి నియోజకవర్గంలోని పలు మండలాలకు సాగునీటిని అదించలేకపోయారన్నారు.

ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో సరైన కాలువలు లేని కారణంగానే సాగునీటిని రైతులకు అందించేందుకు సమస్య ఏర్పడిందని, ఈ సమస్యను పరిష్కరించేందకు 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోమశిల హైలెవల్ కెనాల్ పనులను ప్రారంభించారన్నారు.లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అత్యంత ఎక్కువ ఆశవ్యకత ఉండేది ఆత్మకూరు, నియోజకవర్గాలకేనని అన్నారు.

ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో దాదాపు 5 లక్షల మంది ఉన్నారని, ప్రస్తుతం ఉన్న మంత్రి గతంలో ఎన్నోసార్లు హైలెవల్ కెనాల్ పనుల గురించి పదే పదే ప్రస్తావించారని, అధికారంలోకి వచ్చాక దాని ఊసే మరిచిపోయారని, సంగం బ్యారేజ్ కు దివంగత మంత్రి గౌతమ్ రెడ్డిపేరును కూడా తొలగించారని, బ్యారేజ్ సమీపంలో ఇసుక మాయం చేయడంతో రెండు టీయంసీల నీరు అదనంగా నిల్వ ఉంచేలా చేశారన్నారు.

ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయకుండా అమరావతి పేరుతో ఒకే ప్రాంతాన్ని అభివృద్ది చేసుకుంటూ పోతున్నారని, మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించినట్లుగా మావిగన్ పై దృష్టి సారించాలని, అమరావతిపై పెట్టే నిధుల్లో సగం నిధులు ఈ ప్రాజెక్టలపై పడితే కోట్ల మంది రైతులకు ఉపయోగకరంగాప్రాజెక్టులు అందుబాటులోకి వస్తాయన్నారు.

ఒకే ప్రాంతాన్ని అభివృద్ది పేరుతో లక్షల కోట్లు నిధులు అప్పులు చేస్తున్నారని, ప్రస్తుతం 10లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందని, రాబోయే మూడేళ్లలో 14 లక్షల కోట్లకు చేరుకుంటుందని, ఇప్పుడే దీనిని అడ్డుకోకుంటే మన పిల్లల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలపై గ్రామస్థాయిలో ప్రజలకు తెలియచేసి ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేసేలా అందరం కలసి పోరాడితేనే సాధ్యమవుతుందన్నారు విక్రమ్ రెడ్డి.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story