Nellore: గురువులు, పూర్వ విద్యార్థినుల ఆత్మీయ కలయిక భావోద్వేగం
Nellore: ముత్తుకూరులో గురువులు, పూర్వ విద్యార్థినులు 40 ఏళ్ల తర్వాత కలుసుకుని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.
Nellore
Nellore: మనమంతా అక్షరాల తల్లి బిడ్డలం... అఆల నడుమ పెరిగిన ఆత్మీయ బంధాలం....
మనం జీవితంలో ఎంతటి ఉన్నత శిఖరాలను అధిరోహించినా... ఎంతటి గొప్ప గొప్ప ఉన్నత పదవులు స్థిరపడినా... మనతో కలిసి చదివిన స్నేహితులను మనకు చదువు చెప్పిన గురువులను మనం ఎప్పటికీ ఎన్నటికీ మరువలేం.....
అత్యున్నత స్థితికి మనం చేరినప్పుడు, బెత్తం పట్టుకుని చదువు నేర్పిన గురువు.....
ఆపదలో మనం ఉన్నప్పుడు, మన పక్కన చేయి పట్టుకొని మనతో నడిచిన మిత్రులు గుర్తుకొస్తారు.....
అలాంటి అక్షరాలు పెనవేసుకున్న అనుబంధాలతో సరిగ్గా 40 వసంతాల తరువాత ఈరోజు, గురువులు మరియు పూర్వ విద్యార్ధినుల ఆత్మీయ కలయిక జరిగింది... ఓ అద్భుతం ఆవిష్కృతమైంది.... అలనాటి జ్ఞాపకాలు కనుల ముందు కదలాడాయి... ఆత్మీయ నేస్తాలను చూసి కన్నులు ఆనందంతో తడిశాయి....
అక్షరాలు నేర్పిన గురువులను చూసి ఆకాశమంత ఆనందం.. వాళ్ళని మరో ప్రపంచంలోకి లాక్కెళ్ళిపోయింది.....
నెల్లూరు జిల్లా ముత్తుకూరు లోని "ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల" 1986- 87 నుంచి 2002 వరకు చదివిన పూర్వ విద్యార్థినుల ఆత్మీయ కలయిక కన్నుల పండుగలా జరిగింది....
గురువులు మరియు పూర్వ విద్యార్థినులు కలిసేలా ఒక్కటి చేసింది ఆత్మీయంగా రాసుకున్న ఓ లేఖ....
పాఠశాల ప్రాంగణంలో మొదలైన మన ప్రయాణం.. పుస్తకాల మధ్య నవ్వులు.. క్లాస్ రూమ్ లో చిన్న చిన్న అల్లర్లు... టీచర్ల మందలింపుల్లో దాగిన ప్రేమ... ఆ మధురమైన పాఠశాల రోజులు ఇంకా మన మనసులు తాజాగా ఉన్నాయి.... కాలం మనలను దూరం చేసినా ..ఆ జ్ఞాపకాలు మాత్రం మనల్ని మళ్లీ కలుపుతున్నాయ్..
మనకు మార్గదర్శకులైన గౌరవనీయ ఉపాధ్యాయులను మరలా చూసి నమస్కరించే ఈ అందమైన అవకాశం..
పాత స్నేహితులతో కలిసి నవ్వులు పంచుకునే ఆనంద క్షణాలను మళ్లీ ఆస్వాదించే వేళ... ఈ ఆత్మీయ కలయికకు మీ అందరి నీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం... మీ రాకతో ఈ సమావేశ మందిరం మరింత సార్థకం అవుతుంది... పాత జ్ఞాపకాలు కొత్తగా ఆనందంగా మారే ఈ వేడుకలో.. మీ అందరినీ కలుసుకోవాలని ఎదురు చూస్తున్నాం.. ఆత్మీయంగా ఆహ్వానిస్తూ.. అంటూ రాసుకున్న ఈ లేఖ 40 ఏళ్లుగా దూరమైన ఆత్మీయ బంధాలని గురువులను విద్యార్థులను ఒకటి చేసింది..మరుపురాని జ్ఞాపకాలను మరిన్ని మదినిండా నింపుకొని వెళ్ళింది...!!




