Nellore: నెల్లూరులో నేటి నుంచి డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు!

Nellore: నెల్లూరులో సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు జరిగే డివైఎఫ్ఐ 16వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర కార్యదర్శి జి. రామన్న పిలుపునిచ్చారు.

A Praveen, Nellore
Published on: 31 Aug 2026 6:32 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో నేటి నుంచి డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు!

నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని డాక్టర్ జెట్టి శేషారెడ్డి గారి విజ్ఞాన కేంద్రంలో 2026 సెప్టెంబర్ నెల 1,2,3 తేదీలలో జరుగుతున్న డివైఎఫ్ఐ 16వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి. రామన్న పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ సెప్టెంబర్ 1 , 2, 3 తేదీలలో నెల్లూరు నగరంలో జరుగుతున్న డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభల ను జయప్రదం చేయాలని వారు కోరారు సెప్టెంబర్ నెల 1 వ తేదీ మంగళవారం సాయంత్రం 3-30 గంటలకు వి ఆర్ హై స్కూల్ గ్రౌండ్ వద్ద నుండి భారీ ర్యాలీ అనంతరం నర్తకి సెంటర్లో గొప్ప బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుందని ఈ బహిరంగ సభకు డివైఎఫ్ఐ ఆల్ ఇండియా అధ్యక్షులు ఏ ఏ రహీం గారు ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు జాక్సి థామస్ గారు మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రమణ్యం గారు రాష్ట్ర అధ్యక్షులు వై రాము గారు ముఖ్యవక్తులగా ఉపన్యసించనున్నారని.

సెప్టెంబర్ 2,3 వ తేదీ లలో అపోలో హాస్పిటల్ ఎదురుగానున్న డాక్టర్ జెట్టి శేషారెడ్డి గారి విజ్ఞాన కేంద్రం నందు ప్రతినిధుల సభ రెండు రోజులు పాటు నిర్వహించనున్నారని ఈ ప్రతినిధుల సభలో గత కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తు కర్తవ్యాల రూపొందించుకునేందుకు ఉపయోగపడుతుందని అనంతరం నూతన కమిటీ ఎన్నుకొని రానున్న కాలంలో యువతి యువకులు ఎదుర్కొనే సమస్యలపై ఆనేక తీర్మానాలు చేసి సుదీర్ఘ పోరాటానికి రూపకల్పన చేసేందుకు మరియు రాష్ట్రంలో యువతీ యువకులకు ఒక దిశా ,నిర్దేశం ఇచ్చేందుకు ఈ రాష్ట్ర మహాసభలు ఎంతగానో ఉపయోగపడతాయని వారు తెలియజేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు అనేక వాగ్దానాలు చేశారని అధికారంలోకి వచ్చాక వాగ్దానాలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ప్రధానంగా యువతకి ఇచ్చిన మాటలను కూడా నెరవేర్చలేదని అన్నారు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 8 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో 2.14 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని జాబ్ క్యాలెండర్ ముసుగులో భర్తీ మాత్రం పది వేలు చేయడం సిగ్గుచేటన్నారు.

ఎంత సేపు అమరావతిలో అంతర్జాతీయ స్థాయిలో క్రీడ మైదానాలు గురించి మాట్లాడే చంద్రబాబు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆడుకోవాడానికి కనీస సౌకర్యాలు గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. వంద రోజుల్లో డ్రగ్స్, గంజాయిని తరిమికొడతాం అని చెప్పి, డ్రగ్స్, గంజాయి వ్యాపారం చేసే నాయకులను వెనక్కి వేసుకోరావడం ఎమీటని ప్రశ్నించారు. పోలీస్ శాఖలో ఉన్న ఖాళీ ఉన్న 11,639 పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

రాజకీయ జవాబుదారితనం పై యువత ప్రశ్నించాలని కోరారు. నెల్లూరు జిల్లాలో పరిశ్రమల పేరుతో రైతుల దగ్గర బలవంతంగా భూములు తీసుకుని తీసుకున్న భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా ఆ భూములను బ్యాంకుల్లో తాకట్టుపెట్టి సొమ్ము చూసుకుంటున్నారు తప్ప పరిశ్రమ ఏర్పాటు చేయడం లేదని ఏర్పాటుచేసిన పరిశ్రమల్లో స్థానిక యువతుకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ జీతాలు కు తీసుకువచ్చే పని చేస్తున్నారని స్థానికులకు స్వీపర్సు వాచ్మెన్ లాంటి చిన్నచిన్న ఉద్యోగాలు ఇస్తున్నారని అన్నారు.

వెంటనే పరిశ్రమల పేరుతో చూసుకున్న భూముల్లో వెంటనే పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో స్థానిక యువతకు ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలని జరిగే మహాసభల్లో తీర్మానం చేయబోతున్నామని అని అన్నారు అదేవిధంగా రాజకీయ నాయకుల్లో ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెరిగిపోయిందని అవినీతి అంతానికి డివైఎఫ్ఐ పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని దానికి అనుగుణంగా మహాసభల్లో ధన్యం చేయబోతున్నామని అన్నారు

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి పి నరసింహ , ఎం వి రమణ రూరల్ కార్యదర్శి గోని చైతన్య ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరేంద్ర నగర ఉపాధ్యక్షులు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore

Next Story