Nellore: ప్రేమ వ్యవహారంలో ఆర్థిక సాయం చేశాడని అధికార పార్టీ నేతల అరాచకం

Nellore: నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ వడ్డిపాలెంలో ఒక కుటుంబంపై దాడి చేసి గ్రామ బహిష్కరణ చేసిన ఘటనపై బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 13 July 2026 5:55 PM IST
Nellore
X

Nellore: ప్రేమ వ్యవహారంలో ఆర్థిక సాయం చేశాడని అధికార పార్టీ నేతల అరాచకం

నెల్లూరు: నెల్లూరు జిల్లా, దుత్తలూరు మండలం, నర్రవాడ వడ్డి పాలెంలో దారుణం చోటు చేసుకుంది.. ఇటీవల ఓ యువతి ప్రియుడుతో వెళ్లిపో యినందుకు, బాధిత కుటుంబంలోని ఓ వ్యక్తి ఆర్థికంగా సహకరించాడని దాడికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మహిళతో సహా కుటుంబ సభ్యులంద రిపై దాడి చేయడంతో పాటు, సహకరించిన వ్యక్తిని చెట్టుకు కట్టేసి కొట్టినట్లు సమాచారం అందుతోంది. బాధితులకు తీవ్ర గాయాలయ్యాయి.

యువతి తండ్రి శ్రీనివాసులు నాయుడు, గురవయ్య నాయుడు, వెంగయ్య చౌదరి, మరికొందరు ఈ దాడి చేశారని బాధితులు చెబుతున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులు అధికార పార్టీ కి చెందిన నాయకులని తెలుస్తోంది. ఐదు రోజుల క్రితం దుత్తలూరు మండలం నర్రవాడ వడ్డిపాలెంలో ఘటన జరిగింది.

దాడితో తీవ్ర గాయాల పాలైన బాధితులు ప్రాణం భయంతో ఇతర ప్రాంతాల్లో తల దాచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు ఇవాళ పోలీసులను ఆశ్రయించారు బాధితులు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story