Kovvur: డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్ష!

Kovvur: 2025 డీఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని, లోకేష్ రాజీనామా కోరుతూ వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే దీక్షలు కోవూరులో రెండో రోజుకు చేరాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 7 Aug 2026 1:47 PM IST
Kovvur
X

Kovvur: డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్ష!

Kovvur: కూటమి తెలుగుదేశం ప్రభుత్వం 2025 డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సిబిఐ చే విచారణ చేపట్టి లోకేష్ రాజీనామా చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నది.

ఈ సందర్భంగా మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోవూరు మండల కేంద్రంలో చేపట్టిన

రిలే నిరాహార దీక్ష రెండో రోజుకి చేరుకున్నది ఈ దీక్షలో బుచ్చిరెడ్డిపాలెం మండలం సంబంధించిన వైఎస్సార్సీపీ పార్టీ నేతలు యువత విద్యార్థులు పలువురు మద్దతు దారులు పాల్గొన్నారు.

ఈ దీక్షకు ఎమ్మెల్సీ మేరిగ మురళి, వైసిపి రాష్ట్ర నాయకులు మహేందర్ రెడ్డి,నల్లపరెడ్డి రజిత్ రెడ్డి, పాల్గొని కుమారుడితో కలిసి వైఎస్ రాజశేఖర్ చత్రపతి పాలమాలు వేసి నివాళులర్పించారు అనంతరం దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు.

నిరాహాదీక్షకు బైక్ ర్యాలీలో విద్యార్థులు యువత,నిరుద్యోగులు, విచ్చేసి సంఘీభావం తెలిపారు మురళి మాట్లాడుతూ

కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో కూలిపోయే ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు, ఆనాడు ఎన్నికల్లో ప్రజలకు నిరుద్యోగులు విద్యార్థులకు మాయమాటలు చెప్పి నమ్మించి మోసగించారని తెలిపారు, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి నిరుద్యోగులను మోసగించారని తెలిపారు, జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే ఎక్కడ ఎవరు ఏలిత్తి చూపకుండా గ్రామం నుండి పరిపాలన అందించాలని లక్ష్యంతో సచివాలయం ఉద్యోగులు ఇవ్వడం జరిగిందని తెలిపారు.

వేద విద్యార్థులు కూడా డాక్టర్లు కావాలని లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని ఆలోచిస్తే ఈనాడు ప్రభుత్వం మాయమాటలతో ఆసుపత్రలను ప్రైవేటీకరణ చేసేందుకు చూస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వైఎస్ఆర్సిపి బుచ్చిరెడ్డిపాలెం నేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story