Vinjamuru: వింజమూరు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా డేగ మధు
Vinjamuru: బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా డేగ మధు నియామకం. ఆర్.కృష్ణయ్యకు కృతజ్ఞతలు తెలిపిన వింజమూరు బీజేపీ నాయకులు, పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానం.
Vinjamuru: వింజమూరు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా డేగ మధు
వింజమూరు: బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా వింజమూరుకు చెందిన డేగ మధును బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నియమించారు.ఈ మేరకు ఆయనకు నియామక పత్రాన్ని అందజేస్తూ, బీసీ వర్గాల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం సాధన కోసం సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.
డేగ మధు రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నియమితులైన సందర్భంగా వింజమూరులోని బీజేపీ కార్యాలయంలో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,బీసీ వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న డేగ మధుపై నమ్మకంతో రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించిన ఆర్. కృష్ణయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా బీసీల సంక్షేమం, విద్య, ఉపాధి అవకాశాల విస్తరణ, హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం సంఘం ఆశయాలకు అనుగుణంగా డేగ మధు సమర్థంగా పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బి.ఎల్.ఏ. మాధవరావు, జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి హరిగోపాల్, జిల్లా మోర్చా నాయకులు శ్రీనాధ్, రమేష్, శ్రీను, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




