Jangalapalli: నెల్లూరు జిల్లా జంగాలపల్లిలో పోలీసుల కార్డన్ సెర్చ్.. వాహనాలు స్వాధీనం!
Jangalapalli: నెల్లూరు జిల్లా జంగాలపల్లిలో కలిగిరి సీఐ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్. పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు స్వాధీనం. సైబర్ నేరాలు, గంజాయిపై అవగాహన సదస్సు.
Jangalapalli: నెల్లూరు జిల్లా జంగాలపల్లిలో పోలీసుల కార్డన్ సెర్చ్.. వాహనాలు స్వాధీనం!
కొండాపురం (నెల్లూరు జిల్లా): నెల్లూరు జిల్లా కొండాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని జంగాలపల్లి గ్రామంలో కలిగిరి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచి కార్డన్ సెర్చ్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కొండాపురం, వింజమూరు,కలిగిరి ఎస్సైలతో పాటు 30 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలో విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టగా,సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు,2 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం గ్రామస్థులతో అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్డు భద్రతా నియమాలు, సైబర్ నేరాల నివారణ,మహిళలపై జరిగే నేరాలు మరియు సంబంధిత చట్టాలు,గంజాయి సహా మత్తు పదార్థాల నిర్మూలనకు సంబంధించిన ఎన్‌డీపీఎస్ (NDPS) చట్టం, గ్రామ భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు అవసరంపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గ్రామస్థులకు సూచించారు.




