Nellore: విఆర్సీ సెంటర్ లో కాంగ్రెస్ శ్రేణుల భారీ ధర్నా!
Nellore: జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు.
Nellore: విఆర్సీ సెంటర్ లో కాంగ్రెస్ శ్రేణుల భారీ ధర్నా!
నెల్లూరు: నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని విఆర్సీ సెంటర్ వద్ద, ఢిల్లీలో విద్యార్థులకు అండగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, యం.పి. ప్రియాంక గాంధీని అరెస్టు చేసి, వారిపై కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ, మహనీయుడు డా౹౹బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నీట్ ప్రశ్న పత్రం లీకేజీ కారణంగా నష్టపోయిన విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలచివేస్తుందని, విద్యార్థులు ర్యాంకుల కోసం కోచింగ్ సెంటర్లకు పెట్టె ఖర్చు దేశ బడ్జెట్ మించి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వల్ల విద్యార్థులలో అభద్రత భావం నెలకొందని,
ప్రశ్నాపత్రం లీకేజీతో విద్యార్థులకు జరిగిన నష్టానికి బిజెపి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలకు నైతిక బాధ్యత వహిస్తూ, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చెయ్యాలని, నీట్ పేపర్ లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని,
ప్రధాని మోదీ ఇంటి వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని అవమానించి, అరెస్టు చేయడం దారుణం అని అన్నారు. దేశంలో బిజెపి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఏవిధంగా ఉందో ఇదొక ఉదాహరణ అని,
రాహుల్ గాంధీ మరియు ఎంపీలపై, విద్యార్థులపై పెట్టిన పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.విజయవాడలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పై బిజెపి కార్యకర్తల దాడిని ఖండిస్తున్నామని, ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి చర్యలు ప్రమాదకరం అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ వార్తలను ప్రచురిస్తున్నారు అన్న కారణంగా, మీడియా సంస్థలకు నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్లకు పిలవడం అనేది ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛపై గొడ్డలి వేటు లాంటిదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దేశ విద్యార్థులకు అండగా ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ విద్యార్థులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందని,
అయోధ్య రామ మందిరంలో హిందువులు ఎంతో భక్తి శ్రద్ధతో ఇచ్చిన కానుకలు దోచుకోవడం అనేది, నిజంగా హిందువుల మనోభావాలను అవమానించడమేనని అన్నారు. ఆ స్కామ్ లో ఉన్న వారిని బిజెపి కాపాడడం సిగ్గుచేటని అన్నారు. దేశ చరిత్రలో దేవుడితో స్కామ్ చేసిన ప్రభుత్వం బిజెపి పార్టీ అని అన్నారు. బిజెపి అయోధ్య రామ మందిరం స్కామ్ పై, నీట్ ప్రశ్న పత్రం లికేజీపై చెప్పలేకపోతుందని చెప్పారు. ప్రశ్నిస్తే, బిజెపి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులపై దాడులు చేస్తున్నారని, బిజెపి ప్రభుత్వానికి ఇవే చివరి అవకాశం అని అన్నారు.
విద్యార్థులు ఎవరూ మనోధైర్యాన్ని కోల్పోవద్దని, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో దేశంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య బధ్ధంగా ఎన్నుకోబడుతుందని చెప్పారు.




