Sangam: తరహా భవనాల్లోకి సంగం ఐటీఐ కళాశాల తరలింపు కలెక్టర్ తనిఖీ!

Sangam: సంగం ఐటీఐ కళాశాలను లాంకో భవనాల్లోకి తరలించేందుకు భవనాలను పరిశీలించిన నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా. రూ. 8 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడి.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 4 Sept 2026 11:20 AM IST
Sangam
X

Sangam: తరహా భవనాల్లోకి సంగం ఐటీఐ కళాశాల తరలింపు కలెక్టర్ తనిఖీ!

Sangam: నెల్లూరు జిల్లా సంగం మండలం తరుణవాయి గ్రామ సమీపంలోని లాంకో కంపెనీకి చెందిన భవనాలను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులతో కలిసి పరిశీలించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి సూచనల మేరకు ప్రస్తుతం ఆత్మకూరులోని పాలిటెక్నిక్ కళాశాలలో తాత్కాలికంగా నిర్వహిస్తున్న సంగం ఐటీఐ కళాశాలను ఈ భవనాల్లోకి తరలించే అవకాశాలను పరిశీలించారు.ఈ సందర్భంగా అసంపూర్తిగా ఉన్న భవనాలను అన్ని మౌలిక వసతులతో పూర్తి చేసి, ఆత్మకూరులో తాత్కాలికంగా నిర్వహిస్తున్న ఐటీఐ కళాశాలను తరుణవాయి సమీపంలోని ఈ భవనాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

భవనాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి అవసరమైన నిర్మాణ పనులతో పాటు విద్యుత్, నీరు, ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు సుమారు రూ.8 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు కలెక్టర్ తెలిపారు.మొత్తం భవనాల అభివృద్ధికి అవసరమైన నిధులను సమకూర్చే ప్రక్రియను చేపడుతూ, మొదటి దశలో ఒక భవనాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి అవసరమైన మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ప్రభుత్వ నిధులతో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధులను కూడా వినియోగించుకుని భవనాల నిర్మాణ పనులను పూర్తి చేసి, విద్యార్థులకు మెరుగైన వసతులతో ఐటీఐ కళాశాలను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.భవనాల ప్రస్తుత పరిస్థితి, చేపట్టాల్సిన నిర్మాణ పనులు, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ చర్చించారు.

ప్రస్తుతం ఐటిఐ కళాశాలలో 120 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని, 11 మంది అధ్యాపకులు ఉన్నట్లు చెప్పారు.ఐటీఐ కళాశాలను శాశ్వత భవనాల్లోకి తరలించడం ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యా, శిక్షణ వసతులు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.కలెక్టర్ వెంట ఆత్మకూరు ఆర్డీవో పావని, ఇంజనీరింగ్ అధికారులు, ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్, సిబ్బంది ఉన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story