Kaluwayi: ఉపాధ్యాయ దినోత్సవం వేళ కలువాయిలో రక్తదాన శిబిరం!
Kaluwayi: కలువాయి జెడ్పీ హైస్కూల్‌లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం.. రెడ్‌క్రాస్ చైర్మన్ పెంచల పుల్లయ్య పిలుపు.
Kaluwayi: ఉపాధ్యాయ దినోత్సవం వేళ కలువాయిలో రక్తదాన శిబిరం!
Kaluwayi: నెల్లూరు జిల్లా కలువాయిలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కలువాయిలోని బీవీఎన్ఆర్ జెడ్పీ హైస్కూల్లో రెడ్‌క్రాస్ సబ్ బ్రాంచ్ చైర్మన్ పెంచల పుల్లయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరానికి కలువాయి యువతతో పాటు శివసాయి కళాశాల వారు సహకరించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు, ప్రతి శిబిరంలో యువత సహకారంతో కనీసం 80 యూనిట్ల రక్తాన్ని సేకరిస్తున్నామని చెప్పారు.
రక్తదానం చేయడం ద్వారా సమాజంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని, రక్తదానం వల్ల క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యల ముప్పు తగ్గుతుందని తెలిపారు, ఇప్పటికీ చాలామంది రక్తదానం చేసేందుకు సంకోచిస్తున్నారని, రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించుకుని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో విద్యార్థులు, ఉపాధ్యాయులు,యువత పాల్గొన్నారు.




