Veligonda: నెల్లూరుకు వెలిగొండ జలాలు తేవాలి బీజేపీ విజ్ఞప్తి!
Veligonda: నెల్లూరు కరువు, ఫ్లోరైడ్ గ్రామాలకు వెలిగొండ నీటిని అందించాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి బీజేపీ నేతలు పేర్నాటి రంగారెడ్డి, మిడతల రమేష్ విజ్ఞప్తి.
Veligonda: నెల్లూరుకు వెలిగొండ జలాలు తేవాలి బీజేపీ విజ్ఞప్తి!
Veligonda: ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు వెలిగొండ జలాలు వచ్చేలా కృషి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి బిజెపి సీనియర్ నాయకులు పేర్నాటి రంగారెడ్డి తో కలిసి నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం వెలిగొండను జాతికి అంకితం చేసినందుకు నెల్లూరు జిల్లా మెట్ట ప్రాంత రైతులు ఆనందించారు అయితే పెద్దిరెడ్డి పల్లి రిజర్వాయర్కు నీరందడానికి చాలా సమయం పట్టేలా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతుల ఆవేదనను మంత్రి దృష్టికి బిజెపి నేతలు తీసుకువెళ్లారు. త్వరితగతిన నెల్లూరు జిల్లాకు నీరు వచ్చేలా తన వంతు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
పెద్దిరెడ్డి పల్లి రిజర్వాయర్కు వెలిగొండ జలాలు వచ్చేవరకు రైతుల పక్షాన నిలబడి ఫ్లోరైడ్ బాధితుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు.




