Kondapuram: కొండాపురం హాస్టల్ సమస్యలపై బీజేపీ ఫైర్! అధికారులకు ఫిర్యాదు
Kondapuram: నెల్లూరు జిల్లా కొండాపురం మండల బీసీ బాలుర హాస్టల్ సమస్యలు మరియు కలిగిరి రహదారిపై బీజేపీ నేతల ఫిర్యాదు.
Kondapuram: కొండాపురం హాస్టల్ సమస్యలపై బీజేపీ ఫైర్! అధికారులకు ఫిర్యాదు
నెల్లూరు జిల్లా: కొండాపురం మండలంలోని బీసీ బాలుర హాస్టల్‌లో విద్యార్థులు ఎదుర్కొంటున్న కనీస వసతుల కొరతను పరిష్కరించాలని బీజేపీ నాయకులు అధికారులను కోరారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి, వారి ఇబ్బందులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
జనతా వారధి కార్యక్రమంలో భాగంగా కొండాపురం మండల బీజేపీ అధ్యక్షులు జడపల్లి మహేష్ హాస్టల్ సమస్యలతో పాటు కొండాపురం–కలిగిరి రహదారి సమస్యను గ్రీవెన్స్‌లో నమోదు చేసి, ఎంపీడీవో ఆదినారాయణకు ఫిర్యాదు చేశారు.
హాస్టల్‌లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు, కొండాపురం–కలిగిరి రహదారి సమస్యకు తాత్కాలిక చర్యలకే పరిమితం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చైతన్య, ఉపాధ్యక్షులు కూకట్ల కృష్ణరావు, కార్యదర్శి కొండలరావు తదితరులు పాల్గొన్నారు.




