Nellore: రాజ్యాంగానికి బీజేపీ తూట్లు పొడుస్తోంది: చింతా మోహన్
Nellore: బీజేపీ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తోందని, డీలిమిటేషన్‌తో దేశం ముక్కలయ్యే ప్రమాదముందని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ తీవ్ర విమర్శలు చేశారు.
Nellore: రాజ్యాంగానికి బీజేపీ తూట్లు పొడుస్తోంది: చింతా మోహన్
Nellore: డిలిమిటేషన్ జరిగితే భారతదేశం 6 ముక్కలు అవుతుందని, ఉత్తర భారతదేశానికి 500 సీట్లు, దక్షిణ భారతదేశానికి 300 సీట్లులోపు ఇవ్వాలని అనుకుంటున్నారని, మోడీ, అమిత్ షా ఇద్దరికీ రాజ్యాంగం అంటే తెలీదు, రాజ్యాంగం చదవలేదు. చదవలేరు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ సెంట్రల్ మినిస్టర్ చింతా మోహన్... కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కిలో బియ్యం రూ. 20/ ఉండేది. బిజెపి పాలనలో కిలో బియ్యం ధర రూ.70 పెరిగిందని చెప్పారు.
నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించడంలో బిజెపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దేశంలో పత్రికా స్వేచ్ఛ లేదని , కార్పొరేట్లకు స్వేచ్ఛ వుందని ప్రజా సమస్యలను ధైర్యంగా రాసే, చూపించే ఒక్క పత్రిక, ఒక్క టీవీ కూడా లేదని అన్నారు.బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. బ్యాంకు ఉద్యోగులు డిమాండ్లను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డిఏలు, పీఆర్సీ, పదవీ విరమణ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని కోరుతున్నామని చెప్పారు.




