Singarayakonda: సింగరాయకొండలో బోడా రామచంద్ర యాదవ్‌ను కలిసిన బాధితులు!

Singarayakonda: ప్రకాశం సింగరాయకొండలో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్‌ను కలిసిన శ్రీచైతన్య నవోదయ సెంటర్ మృతుడు తౌషిక్ తల్లిదండ్రులు. న్యాయ పోరాటానికి హామీ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 7 Sept 2026 2:10 PM IST
Singarayakonda
X

Singarayakonda: సింగరాయకొండలో బోడా రామచంద్ర యాదవ్‌ను కలిసిన బాధితులు!

Singarayakonda: ప్రకాశం జిల్లా సింగరాయకొండలో BCY పార్టీ అధినేత బోడా రామచంద్ర యాదవ్ ని కలిశారు శ్రీ చైతన్య నవోదయ సెంటర్ మృతుడు తౌషిక్ తల్లి, తండ్రులు మౌలాబి, అలీలు తన కొడుకు మృతి మృతి చెంది ఆరు నెలలు అవుతున్న తమకు న్యాయం జరగలేదని న్యాయం కోసం న్యాయం పోరాటం చేస్తుంటే విద్యాసంస్థ యాజమాన్యం తమ పై బెదిరింపులకు పాల్పడుతుందని తమపై తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారని తమ కొడుకు మృతి చెందిన హాస్టల్ భవనానికి ఎటువంటి అనుమతులు లేవని తమ కొడుకు పరిస్థితి మరి ఏ తల్లికి రాకూడదని తమకు న్యాయం చేయాలంటూ రామచంద్ర యాదవ్ కోరిన బాధితులు.

బాధిత కుటుంబానికి పిసివై పార్టీ అండగా ఉంటుందని తమకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని రామచంద్ర యాదవ్ హామీ ఇచ్చారు.. గత కొన్ని సంవత్సరాలుగా విద్యాసంస్థకు చెందిన హాస్టల్ కు ఎటువంటి అనుమతులు లేకపోయినా సంబంధిత విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రామచంద్ర యాదవ్ తక్షణమే విద్యాశాఖ స్పందించి అనుమతులు లేని శ్రీ చైతన్య నవోదయ సెంటర్ హాస్టల్ భవనాన్ని మూసివేయాలని లేకుంటే బీసీవై పార్టీ బాధితుల పక్షా నిలిచి ఉద్యమం చేయబడుతుందని హెచ్చరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story