Kaluwaya: కలువాయిలో విద్యా చైతన్యం.. ప్రభుత్వ బడికి రండి!
Kaluwaya: నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో 'బడి పిలుస్తోంది' ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు.
Kaluwaya: కలువాయిలో విద్యా చైతన్యం.. ప్రభుత్వ బడికి రండి!
కలువాయి: నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో బడి పిలుస్తోంది కార్యక్రమం లో భాగంగా ఎంపీపీఎస్ కలువాయి అరుంధతీయ పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారి-2 S. జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమము నిర్వహించారు,పాఠశాల ప్రధానోపాధ్యాయులు Y.తిరుపతమ్మ మరియు ఉపాధ్యాయులు వినూత్న కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో విద్యార్థుల చేత మానవహారం , వీధులలో ర్యాలీ, మరియు ప్రతి గడపకి వెళ్లి ఒకటవ తరగతి విద్యార్థులను మరియు బడి ఈడు పిల్లలందరినీ గవర్నమెంట్ పాఠశాలలోనే చేరే విధంగా తల్లిదండ్రులు కృషి చేయాలి అని తెలియజేశారు. ఈ సందర్బంగా మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ ప్రభుత్వ బడులలో అనేక వసతులను కల్పిస్తుందన్నారు,తల్లికి వందనం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర కిట్లు, మనబడి మన భవిష్యత్తు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం.
మొదలగున కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు, తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన కల్పించి ప్రతి విద్యార్థిని కూడా గవర్నమెంట్ పాఠశాలల చేర్పించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు పుల్లయ్య, పెంచలమ్మ, రాజ్యలక్ష్మి. దిలీప్ మరియు సిఆర్ఎంటి మహేశ్వర్, అంగనవాడి టీచర్ లక్ష్మమ్మ, సునీత మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.




