Nellore: రాపూరు-గూడూరు రహదారిపై ప్రయాణికుల నరకయాతన!
Nellore: నెల్లూరు-కడప జిల్లాలను కలిపే గూడూరు-రాపూరు రోడ్డు గుంతలమయంగా మారింది. ప్రయాణికులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణిస్తున్న తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం.
Nellore: రాపూరు-గూడూరు రహదారిపై ప్రయాణికుల నరకయాతన!
Nellore: నెల్లూరు,కడప జిల్లాలను కలిపే అత్యంత కీలకమైన ప్రధాన రహదారి నిత్యం వేలాది వాహనాలతో బిజీగా ఉండే గూడూరు - రాపూరు రోడ్డు
అవును. మీరు చూస్తున్నది రోడ్డా లేక ఏకంగా పెద్ద గోతుల మైదానమా అని ఆశ్చర్యపోకండి ప్రభుత్వాలు మారుతున్నాయి నాయకులు మారుతున్నారు కానీ, ఈ రాపూరు-గూడూరు రహదారి తలరాత మాత్రం అించింతే ఉండిపోయింది అసలు ఈ రోడ్డుకి మోక్షం లభించేది ఎప్పుడు ప్రజల నరకయాతన తీరేది ఎప్పుడు.
రెండు జిల్లాల ప్రజా రవాణాకు అత్యంత కీలకమైన ఈ గూడూరు రోడ్డు పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే... ఈ దారిలో వెళ్లాలంటేనే ప్రయాణికులు వణికిపోతున్నారు..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మార్పు వస్తుందని ఆశపడ్డ ప్రజలకు నిరాశే ఎదురైంది. ప్రకటనలు, హామీలు మాటలకే పరిమితమయ్యాయా చేతల్లో అభివృద్ధి ఎక్కడ.. అని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే జాగ్రత్త రోడ్డుపై ఉన్న గుంతల్లో బైక్లు మునిగిపోతున్నాయి, కార్లు, బస్సులు అదుపు తప్పుతున్నాయి. ఇక గర్భిణుల పరిస్థితి వర్ణనాతీతం..ఈ రోడ్డులో ప్రయాణిస్తే డాక్టర్ సహాయం లేకుండానే డెలివరీ అయిపోయేంత భయంకరమైన కుదుపులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి దాపురించింది.
అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా నిద్రమత్తు వీడాలి. కేవలం హామీలతో సరిపెట్టకుండా, తక్షణమే ఈ రాపూరు-గూడూరు రహదారికి మరమ్మతులు చేపట్టి, శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన బాట పడతామని హెచ్చరిస్తున్నారు.




