Atmakur: ఆత్మకూరులో ఉధృతంగా వైఎస్సార్‌సీపీ రిలే దీక్షలు
Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో రెండవ రోజుకు చేరిన వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్షలు. డీఎస్సీ-2025 అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్.
Atmakur: ఆత్మకూరులో ఉధృతంగా వైఎస్సార్‌సీపీ రిలే దీక్షలు
ఆత్మకూరు: కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ–2025లో జరిగిన అవకతవకలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజూ కొనసాగాయి. ఈ దీక్షలకు ఆత్మకూరు నియోజకవర్గ పరిశీలకులు పేర్నాటి కోటేశ్వరరెడ్డి హాజరై సంఘీభావం ప్రకటించారు.
నిరుద్యోగ యువతకు మద్దతు తెలుపుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం దీక్షలో కూర్చున్ నాయకులకు పేర్నాటి కోటేశ్వరరెడ్డితో పాటు
ఉదయగిరి నియోజకవర్గ పరిశీలకులు కూనం సుధాకర్ రెడ్డి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య, రాష్ట్ర మున్సిపల్ విభాగ కార్యదర్శి అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి, జిల్లా బూత్ కమిటిల అధ్యక్షుడు బాలిరెడ్డి సుధాకర్ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్ రెడ్డి, మర్రిపాడు కన్వీనర్ చెన్ను వెంకటేశ్వరరెడ్డి, నోటి వినయ్ కుమార్ రెడ్డిలు దీక్ష శిబిరంలో కూర్చున్న వారికి కండువాలు కప్పి రెండో రోజు దీక్షలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా పేర్నాటి కోటేశ్వరరెడ్డి మాట్లాడుతూ. ఎన్నికలకు ముందు మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతను నమ్మించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని ఆరోపించారు.
డీఎస్సీ నియామకాల్లో అనేక అక్రమాలు జరిగాయని రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు, విద్యావేత్తలు, నిరుద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నప్పటికీ ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా కాలయాపన చేస్తోందన్నారు. పారదర్శకంగా నిర్వహించాల్సిన నియామక ప్రక్రియపై అనుమానాలు వ్యక్తమవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.
డీఎస్సీ నియామకాలపై వెంటనే సీబీఐతో నిష్పాక్షిక విచారణ చేపట్టి వాస్తవాలను ప్రజల ముందుంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారానికి పూర్తి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. నిరుద్యోగ యువత జీవితాలతో రాజకీయాలు చేయడం దారుణమని, ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం మానుకోవాలని సూచించారు.
ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆయన విమర్శించారు. రెండేళ్లుగా చెల్లించాల్సిన నిరుద్యోగ భృతిని బకాయిలతో సహా వెంటనే విడుదల చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడి సిద్ధమైన అభ్యర్థుల భవిష్యత్తును ప్రభుత్వం అంధకారంలోకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.డీఎస్సీ అక్రమాలపై నిజాలు వెలుగులోకి వచ్చి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగుతాయని పేర్నాటి కోటేశ్వరరెడ్డి స్పష్టం చేశారు.
నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు పార్టీ అండగా ఉంటుందని, ప్రభుత్వం వెంటనే స్పందించి పారదర్శక విచారణకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు రిలే నిరాహార దీక్షల్లో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని డీఎస్సీ అక్రమాలపై నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
రెండవ రోజు రోజు దీక్షల్లో అనంతసాగరం మండల కన్వీనర్ బిజివేముల పిచ్చిరెడ్డి, ఉగ్గుమూడి రఘురామిరెడ్డి, పూనూరు గంగాధర్ రెడ్డి, అక్కలరెడ్డి అంకిరెడ్డి, జిల్లా యాక్టివిస్ట్ సెక్రటరి బట్రెడ్డి జనార్థన్ రెడ్డి, మాజీ సర్పంఛ్ లు నోటి సుందరరామిరెడ్డి, కమతం శోభా, సడ్డా రవీంద్రరెడ్డి, వై శ్రీనివాసులరెడ్డి, వైస్ ఎంపీపీ, పాణెం శ్రీనివాసులు పొలంరెడ్డి శేఖర్ రెడ్డి, నేలటూరి మల్లికార్జున, మదమంచి వెంకటరత్నం, ఒంటేరు సుధీర్ రెడ్డి,
కుప్పా మల్లికార్జునరెడ్డి, మాదవరెడ్డి, వడ్లపల్లి శ్రీను, ఖాజామొహిద్దీన్, ప్రభాకర్, జీయావుద్దీన్, ఎల్ హరీష్, నవీన్, ప్రవీణ్, దామోదర్, తిరుపాల్, సునీల్, శ్రీకాంత్ కాకుమూరి వెంకటరెడ్డి, చిరంజీవిరెడ్డి, గంగవరపు కృష్ణారెడ్డి, ప్రదీప్ యాదవ్, సాయియాదవ్, విద్యార్థి, యువజన నాయకులు ఉన్నారు.
ఈ కార్యక్రమాల్లో ఇందూరు సురేంద్రరెడ్డి, గడ్డం శ్రీనివాసులరెడ్డి, బొమ్మిరెడ్డి రవికుమార్ రెడ్డి, అంబటి కృష్ణారెడ్డి, బాల అంకయ్య, పెయ్యల ఈశ్వరయ్య, పులిమి రమేష్ రెడ్డి, జనార్థన్ రెడ్డి, వెంకటేశ్వరలునాయుడు, మస్తాన్ రెడ్డి, నందవరం ప్రసాద్, పొంగూరు సుధాకర్, బొర్రా విష్ణువర్థన్ రెడ్డి, జనార్థన్ రెడ్డి, మస్తాన్ రెడ్డి, దశరధరామిరెడ్డి, పెంచలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.




