Atmakur: నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన టి. వెంకటేశ్వర్లు

Atmakur: ఆత్మకూరు నూతన డీఎస్పీగా టి. వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు. శాంతిభద్రతలు, మహిళల భద్రత, సైబర్ నేరాల నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 31 Aug 2026 8:34 PM IST
Atmakur
X

Atmakur: నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన టి. వెంకటేశ్వర్లు

నెల్లూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నూతన డీఎస్పీగా టి. వెంకటేశ్వర్లు నేడు బాధ్యతలు స్వీకరించారు.ఆత్మకూరు డీఎస్పీగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియా మిత్రులతో మాట్లాడుతూ,ఆత్మకూరు సబ్-డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే, వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.అదేవిధంగా పేకాట, జూదం, బెట్టింగ్, కోడి పందాలు మట్కా తదితర అసాంఘిక మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మహిళలు మరియు చిన్నారుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని, వారిపై ఎవరైనా దాడులు, వేధింపులు లేదా ఇతర అఘాయిత్యాలకు పాల్పడితే ఎంతటి వారైనా కఠినమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు.అలాగే, ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులు, వినతులు మరియు సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా స్వీకరించి, దాని స్వభావాన్ని బట్టి వెంటనే విచారణ చేపట్టి, చట్టపరంగా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తామని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను ఎలాంటి భయం లేకుండా పోలీసుల దృష్టికి తీసుకురావచ్చని, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకత, వేగం మరియు బాధ్యతాయుతమైన స్పందన ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు సైబర్ మోసాలు, ఆన్‌లైన్ ఆర్థిక నేరాలు, అనుమానాస్పద లింకులు, OTPలు మరియు వ్యక్తిగత సమాచార పరిరక్షణ విషయంలో అప్రమత్తంగా ఉండేలా అవగాహన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.

సబ్-డివిజన్ పరిధిలోని ప్రాంతాలను స్వయంగా క్షేత్రస్థాయిలో సందర్శించి, స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించి, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ప్రజల సహాయ సహకారాలతో వాటికి శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ప్రత్యేకంగా ఆత్మకూరు పట్టణంలో తరచుగా ఏర్పడుతున్న ట్రాఫిక్ జామ్ సమస్య పరిష్కారంపై దృష్టి సారిస్తామని, పోలీసు, మున్సిపల్, రెవెన్యూ మరియు ఇతర సంబంధిత శాఖల సమన్వయంతో పాటు వ్యాపారులు, వాహనదారులు మరియు ప్రజల సహకారంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story