Nellore: ఆర్డీవో పావని నిర్వహణ అద్భుతం.. కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా అభినందన సభ

Nellore: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్డీవో బి. పావనిని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఘనంగా సత్కరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 April 2026 12:17 PM IST
Nellore
X

Nellore: ఆర్డీవో పావని నిర్వహణ అద్భుతం.. కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా అభినందన సభ

ఆత్మకూరు (నెల్లూరు): ఆత్మకూరు ఆర్టీవో బి.పావని ని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఘనంగా సత్కరించి అభినందించారు. వింజమూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు ఆత్మకూరు ఆర్టీవో బిపావనిని ప్రత్యేకంగా ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు.

వింజమూరులో నిర్వహించిన కార్యక్రమాన్ని ఇన్చార్జి ఆర్టీవో 15 రోజులుగా వింజమూరులోనే ఉంటూ రాత్రి పగలు పూర్తి పర్యవేక్షణతో అధికారులను శాఖలసమన్వయపరుస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షుకుక్ల వారి కార్యాలయంలో ఆర్టీవో బి పావని ని అభినందించి ఘనంగా సత్కరించారు. ఆర్డీవో పావని విధుల పట్ల అత్యంత చిత్తశుద్ధి, పాలనలో నేవానిరతి కలిగి ఉంటారు. ఉన్నతాధికారులు ఆదేశాలు, ప్రభుత్వ పధకాలు,కార్యక్రమాలు నూరు శాతం అమలు చేస్తుంటారు. ప్రభుత్వం రూపొందించిన పి4 పధకాన్ని అత్యంత శ్రద్ధతో అమలుచేస్తూ వేలాదిమంది మార్గదర్శకులు,బంగారు కుటుంబాలను గుర్తించి నమోదు చేయించడంతో పాటు అనేక పేద కుటుంబాలకు ఉపాధి, మౌళిక వసతులు కల్పించారు.

ఆమె సేవలను గుర్తించిన జిల్లా యంత్రాంగం గత ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం నాడు, ఈ జనవరి 26 గణతంత్ర దినోత్సవం నాడు జిల్లా ఉత్తమ అవార్డులను మంత్రి పొంగూరు నారాయణ, జిల్లా కలెక్టర్ హిమాన్న్ శుక్ల చేతులమీదుగా అందుకున్నారు. ఆమె సేవల పట్ల ఇటు ప్రజలు ఆటు ఉన్నతాధికారులు, ప్రజాప్రతిధులు అత్యంత సంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. గత ఏడాది ఆత్మకూరు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటించిన కార్యక్రమాలను ఆర్డీవో పావని అత్యంత సమర్ధవంతంగా నిర్వహించి విజయవంతం చేశారు. తాజాగా ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరుకు ముఖ్యమంత్రి రాగా ఆ కార్యక్రమాన్ని కూడా ఆమె విజయవంతంగా నిర్వహించి కలెక్టర్ హిమాన్షా శుక్ల ప్రశంసలు,అభినందనలు, సన్మానం అందుకున్నారు. ఆమెకు లభించిన పురస్కారానికి ఆత్మకూరు ప్రజాప్రతినిధులు, ప్రజలు హర్షిస్తూ ఆమెకు అభినందనలు తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story