Atmakur: గంజాయి తాగితే బుక్కే.. రంగంలోకి ప్రత్యేక డ్రగ్ టెస్టింగ్ కిట్లు!
Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లు, నేరగాళ్లకు సిఐ గంగాధర్, ఎస్సై జిలాని గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
Atmakur: గంజాయి తాగితే బుక్కే.. రంగంలోకి ప్రత్యేక డ్రగ్ టెస్టింగ్ కిట్లు!
నెల్లూరు జిల్లా: ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.. అందులో భాగంగా ఆత్మకూరు సిఐ గంగాధర్ , ఎస్సై జిలాని ఆధ్వర్యంలో నేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లు ఇతర నేరగాళ్లను పోలీస్ స్టేషన్ కు పిలిచి పలు హెచ్చరికలు చేశారు. మత్తు పదార్థాలు సేవించిన వారిని గుర్తించేందుకు ప్రత్యేక డ్రగ్ టెస్టింగ్ కిట్లను నేడు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కు జిల్లా కార్యాలయం నుండి వచ్చాయి. వీటి ద్వారా మత్తు పదార్థాలు సేవించిన వారిని పరీక్షించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వీటి ద్వారా పరీక్షించి మత్తు పదార్థాలు సేవించిన వారిని కఠినంగా శిక్షించేందుకు కేసులు నమోదు చేస్తామని సీఐ గంగాధర్ వారిని హెచ్చరించారు..
ఈరోజు స్టేషన్ కు వచ్చిన ప్రతి ఒక్కరిని పరీక్షించి నెగటివ్ రావడంతో మందలించి హెచ్చరించారు.. ఎక్కడైనా గంజాయి సేవించినట్లు సమాచారం వచ్చిన వెంటనే అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అందించిన ప్రత్యేక పరీక్ష ద్వారా గుర్తించి కేసు నమోదు చేసి కఠిన శిక్ష ఉంటుందని హెచ్చరించారు.. పోలీసులకు ఈ డ్రగ్ కిడ్స్ చేరడంతో ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇకపై మరో లెక్క అనే విధంగా పోలీసు తీరు మారనుంది.




