Atmakur: ఆత్మకూరులో మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ ఆకస్మిక తనిఖీ!

Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ పారిశుధ్య పనులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 19 Aug 2026 8:36 PM IST
Atmakur
X

Atmakur: ఆత్మకూరులో మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ ఆకస్మిక తనిఖీ!

ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో పారిశుధ్య పనుల తీరును మెరుగుపరిచే దిశగా మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ బుధవారం ఆకస్మిక ఫీల్డ్ విజిట్ నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి కొనసాగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు.

పారిశుధ్య సిబ్బంది పనితీరును స్వయంగా తనిఖీ చేశారు. రోడ్లు, డ్రైనేజీలు, పరిసర ప్రాంతాల్లో ఎక్కడా చెత్త పేరుకుపోకుండా నిరంతరం పారిశుధ్య పనులు చేపట్టాలని సిబ్బందికి సూచించారు.పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఆదేశించారు.

ప్రజలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడమే మున్సిపాలిటీ ప్రధాన లక్ష్యమని కమిషనర్ గంగా ప్రసాద్ తెలిపారు. పారిశుధ్య పనులపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ పరిశీలనలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story