Atmakur: వినాయక మండప అలంకరణలో విషాదం ఆత్మకూరు హోంగార్డ్ ప్రసాద్ మృతి!

Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో విద్యుత్ షాక్‌కు గురై హోంగార్డ్ ప్రసాద్ మృతి చెందారు. వినాయక మండపం వద్ద లైటింగ్ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 14 Sept 2026 11:00 AM IST
Atmakur
X

Atmakur: వినాయక మండప అలంకరణలో విషాదం ఆత్మకూరు హోంగార్డ్ ప్రసాద్ మృతి!

Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరు డిఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ కాటిబోయిన మల్లం ప్రసాద్ వినాయక చవితి సందర్భంగా క్వార్టర్స్ లో నిన్న రాత్రి సుమారు 11 గంటల సమయంలో వినాయక మండపం ఏర్పాటు చేసే క్రమంలో విద్యుత్ దీపాలంకరణ చేస్తుండగా విద్యుత్ సరఫరా పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ కు గురై కింద పడిపోయాడు.

దీంతో తోటి సిబ్బంది హఠావుట్టిన ప్రసాదను పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో వినాయక చవితి పండుగ రోజున పోలీస్ శాఖలో విషాద సాయిలు అమలుకున్నాయి.

ప్రసాద్ స్వగ్రామం మర్రిపాడు మండలంలోని కృష్ణాపురం గ్రామానికి చెందిన వ్యక్తి ప్రసాద్ మృతదేహానికి పోలీసులు నివాళులు అర్పించి స్వగృహం తరలించారు. అనంతరం ఈ సంఘటనపై ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేసి,దర్యాప్తు చేస్తున్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)