Nellore: ఆత్మకూరులో భారీ పైప్‌లైన్ లీకేజీ.. నీటమునిగిన ఫారెస్ట్ ఆఫీస్!
Nellore: ఆత్మకూరులో ప్రధాన నీటి పైప్‌లైన్ లీకేజీతో ఫారెస్ట్ ఆఫీస్ జలమయమైంది. తాగునీరు వృథా అవుతుండటంతో శాశ్వత మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Nellore: ఆత్మకూరులో భారీ పైప్‌లైన్ లీకేజీ.. నీటమునిగిన ఫారెస్ట్ ఆఫీస్!
పైప్‌లైన్ లీకేజీతో ఫారెస్ట్ ఆఫీస్ జలమయం
నెల్లూరు జిల్లా: ఆత్మకూరులోని డీఎస్పీ కార్యాలయం ఎదురుగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి టిట్కో అపార్ట్‌మెంట్ వైపు వెళ్లే ప్రధాన నీటి పైప్‌లైన్ భారీ
లీకేజీతో తాగునీరు వృధాగా పోతుంది. లీకేజీ నీటితో ఫారెస్ట్ ఆఫీస్ పరిసర ప్రాంతం నీటమునిగింది. పైప్‌లైన్ లీకేజీకి రెండు రోజులుగా మరమ్మతులు చేపట్టినప్పటికీ సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదని స్థానికులు తెలిపారు.డ్యామేజ్ అయిన పైపులకు జాయింట్లు వేసి మరమ్మతులు చేస్తున్నప్పటికీ అవి నిలవకపోవడంతో మళ్లీ లీకేజీ ఏర్పడుతోందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో పైప్‌లైన్ లీకేజీ సమస్య తలెత్తడం ఇది నాలుగోసారి అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.తాత్కాలిక మరమ్మతులతో సమస్యను పరిష్కరించకుండా, దెబ్బతిన్న పైప్‌లైన్‌ను పూర్తిగా మార్చి శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు. లీకేజీ కారణంగా వృథాగా పోతున్న నీటిని అరికట్టి, పరిసర ప్రాంతాల్లో నీటి ముంపు సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.




