Atmakur: టీ మాస్టర్‌కు వైద్య సాయం అందించిన డాక్టర్ ప్రణీత్
Atmakur: ఆత్మకూరులో గుండె సమస్యతో బాధపడుతున్న టీ మాస్టర్ ఖాదర్ బాషా కుటుంబానికి డాక్టర్ వింజం దొరసానమ్మ ట్రస్ట్ ద్వారా 3 నెలల మందులు అందజేశారు.
Atmakur: టీ మాస్టర్‌కు వైద్య సాయం అందించిన డాక్టర్ ప్రణీత్
ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని 15వ వార్డుకు చెందిన షేక్ ఖాదర్ బాషా పట్టణంలోని ఓ టీ దుకాణంలో టీ మాస్టర్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్న తరుణంలో ఇటీవల హఠాత్తుగా గుండె సంబంధిత వ్యాధికి గురయ్యారు.
రెక్కాడితే గాని డొక్కాడని షేక్ ఖాదర్ బాషా కుటుంబం రోడ్డున పటింది. కనీసం మందులు కొనుగోలు చేసేందుకు కూడా డబ్బులు లేకపోవడంతో ఈ విషయాన్ని 15వ వార్డుకు చెందిన షేక్ రహీం డాక్టర్ జాగర్లమూడి ప్రణీత్ దృష్టికి తీసుకెళ్లారు.
విషయం తెలుసుకున్న డాక్టర్ ప్రణీత్ వెంటనే స్పందించి, ఖాదర్ బాషా కుటుంబానికి అండగా నిలిచారు.డాక్టర్ వింజం దొరసానమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మూడు నెలలకు సరిపడా గుండె సంబంధిత మందులను అందించేందుకు ముందుకు వచ్చారు.
ఈ మేరకు ఈరోజు ఆత్మకూరులోని డాక్టర్ ప్రణీత్ ఛాంబర్‌లో షేక్ ఖాదర్ బాషా కుటుంబ సభ్యులకు మూడు నెలలకు సరిపడా మందులను అందజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు డాక్టర్ వెంకట సందీప్,డాక్టర్ కుమార్, తోడేటి అశోక్, రహీం ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.




