Nellore: ఏఎస్ పేటలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు!
Nellore: నెల్లూరు జిల్లా ఏఎస్ పేటలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Nellore: ఏఎస్ పేటలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు!
నెల్లూరు: నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండల కేంద్రంలో ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఎస్ పేట మండల పరిధిలోని ఫోటోగ్రాఫర్స్ అందరూ ఒకచోట చేరి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
ముందుగా కేక్ కట్ చేసి, ఒకరికొకరు పంచుకున్నారు. అనంతరం ఫోటోగ్రాఫర్స్ డే శుభాకాంక్షలు తెలుపుకున్నారు.కెమెరా వెనుక నిలబడి ప్రతి మధురమైన క్షణాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ఫోటోగ్రాఫర్స్ సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.ఒక ఫోటో... వెయ్యి మాటలతో సమానమని కాలం గడిచినా జ్ఞాపకాలను పదిలంగా నిలిపేది ఫోటోగ్రఫీ అని ఏఎస్ పేట ఫోటోగ్రాఫర్స్‌కు ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నామని తెలిపారు.
Next Story




