Nellore: ఏఎస్ పేటలో అర్ధరాత్రి రౌడీ మూకల హల్‌చల్!
Nellore: నెల్లూరు జిల్లా ఏఎస్ పేట దర్గా నగరఖానా సెంటర్‌లో అర్ధరాత్రి రౌడీ మూకల హల్‌చల్. 6 మందిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు. నలుగురు పరారీ.
Nellore: ఏఎస్ పేటలో అర్ధరాత్రి రౌడీ మూకల హల్‌చల్!
Nellore: ఏఎస్ పేట లో మద్యం మత్తులో అర్ధ రాత్రి యువకుల హల్ చల్....మొత్తం 10 మంది ముఠా ఉన్నట్టు వారిలో నలుగురు పారిపోగా 6 మందిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు.
నిత్యం వందల,వేలమంది భక్తులతో ఆద్యాత్మిక ప్రాంతంగా సర్వమత సమ్మేళనం కు ప్రతీకగా నిలుస్తున్న నెల్లూరు జిల్లా ఏఎస్ పేట దర్గా నగరఖానా సెంటర్ వద్ద ఆదివారం అర్దరాత్రి కొందరు రౌడీ మూకలు రెచ్చిపోయారు, బహిరంగంగా మద్యం సేవిస్తూ ఇదేంటని ప్రశ్నించిన స్థానికులపై దాడికి ప్రయత్నం చేయడం కలకలం రేపుతుంది.
స్థానిక యువత ప్రతిఘటించి ఈ రౌడీ ముఠా లోని ఆరుగురిని అతికష్టం పై పట్టుకుని AS పేట పోలీసులకు అప్పగించినట్టు,మరో నలుగురు రౌడీ లు పారిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు,ఈ రౌడీ ముఠా లో మొత్తం 10 మంది ఉన్నట్టు వీరిలో నేర చరిత్ర ఉన్నవారు, రౌడీ షీటర్లు ఉండే అవకాశం ఉందని,వీరిలో కొందరు కొన్ని రోజుల క్రితమే జైలు నుండి బయట వచ్చినట్టు కొందరు నెల్లూరు,ఇంకొందరు గూడూరు ప్రాంతాలకు చెంది ఉండొచ్చని వీరిని స్థానికంగా ఓ వ్యక్తి తీసుకు వచ్చినట్టు ఆర్ధిక వ్యవహారం లో సుఫారి ఇచ్చి పని పూర్తిచేసేందుకు తీసుకు వచ్చారా అనే విషయం కూడా స్థానికుల్లో చర్చ జరుగుతుంది.
పూర్తి వివరాలు పోలీసు దర్యాప్తు లో తేలాల్సి ఉంది, ఓ వైపు నెల్లూరు జిల్లా పోలీసులు నేరగాళ్ల పై ఉక్కుపాదం మోపుతున్నపటికీ కొన్ని చోట్ల ఇంకా రౌడీలు తమ తీరు మార్చుకోకుండా జైలుకు వెళ్లివచ్చినా మళ్ళీ రౌడీ ఇజం చేస్తూ ఉండడం ఆందోళన కలిగించే అంశం రౌడీల పై నిత్యం పోలీసు నిఘా ఉండాలని వారి కదలికలు గమనిస్తే తప్ప వారి తీరులో మార్పు వచ్చే అవకాశం తక్కువగా ఉందని స్థానికులు తెలుపుతున్నారు.




