Nellore: నేడే ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నెల్లూరు పర్యటన
Nellore: ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ బుధవారం (జూలై 8) నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు.
Nellore: నేడే ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నెల్లూరు పర్యటన
Nellore: ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ గౌరవ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ బుధవారం (జూలై 8) నెల్లూరులో పర్యటించనున్నారు.
ఈ సందర్భంగా బుధవారం ఉదయం 11 గంటలకు నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్) ఐపీ భవనం నాలుగో అంతస్తులోని క్లినికల్ లెక్చర్ గ్యాలరీలో వన్ స్టాప్ సెంటర్ల సిబ్బందికి అవగాహన, సామర్థ్య పెంపొందింపు శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హేనా సుజన్ తెలిపారు.
బుధవారం ఉదయం 7 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి ఉదయం 11 గంటలకు నెల్లూరుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 11 గంటల నుంచి 2.30 గంటల వరకు నిర్వహించే అవగాహన కార్యక్రమంలో పాల్గొని, అనంతరం మధ్యాహ్న భోజన విరామం తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు తిరుగు ప్రయాణమై, సాయంత్రం 7 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారని తెలిపారు.




