Nellore: ఏపీలో రియల్ ఎస్టేట్ రంగానికి ఊరట: మంత్రి నారాయణ కీలక ఆదేశాలు

Nellore: భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతుల్లో సాఫ్ట్‌వేర్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, హైరైజ్ అనుమతులకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 12 Sept 2026 4:17 PM IST
Nellore
X

Nellore: ఏపీలో రియల్ ఎస్టేట్ రంగానికి ఊరట: మంత్రి నారాయణ కీలక ఆదేశాలు

Nellore: భవన నిర్మాణదారులకు, రియల్ ఎస్టేట్ రంగానికి భారీ ఊరట నిస్తూ రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక సమీక్ష నిర్వహించారు.

టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విద్యుల్లతతో పాటు CREDAI, NAREDCO ప్రతినిధులు హాజరైన ఈ సమావేసంలో... లే అవుట్‌ లు, భవన నిర్మాణ అనుమతుల దరఖాస్తుల సమయంలో తలెత్తుతున్న సాఫ్ట్వేర్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

అనుమతులను మరింత సులువుగా, పారదర్శకంగా జారీ చేయడమే లక్ష్యంగా... 5 అంతస్తులు మరియు అంతకంటే పైబడిన భవనాల అనుమతులను వేగవంతం చేయడానికి డైరెక్టరేట్‌లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో తెచ్చిన కీలక సంస్కరణలను పక్కాగా అమలు చేసి, నిబంధనల ప్రకారం పారదర్శకంగా మెరుగైన సేవలు అందించే బాధ్యత అధికారులపైనే ఉందని మంత్రి తేల్చి చెప్పారు..

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE