Vangallu: ఇంటింటికీ వెళ్లి పింఛన్లను అందజేసిన మంత్రి రామనారాయణ రెడ్డి!

Vangallu: సంగం మండలం వంగల్లులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఇంటింటికీ వెళ్లి అందజేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. రహదారులు, ఆలయాల అభివృద్ధికి హామీ.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 1 Sept 2026 1:25 PM IST
Vangallu
X

Vangallu: ఇంటింటికీ వెళ్లి పింఛన్లను అందజేసిన మంత్రి రామనారాయణ రెడ్డి!

Vangallu: నెల్లూరు జిల్లా సంగం మండలం వంగల్లు గ్రామంలో మంగళవారం పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.అదేవిధంగా గ్రామంలో పలు సమస్యల గురించి ప్రజలు మంత్రికి తెలియచేశారు.

సమస్యల పరిష్కారానికి తక్షణమే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి నెలా 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పండుగను నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 61,92,522 మంది లబ్ధిదారులకు రూ.2,694 కోట్ల పింఛన్‌ మొత్తాన్ని వారి ఇళ్ల వద్దే అందిస్తున్నట్లు చెప్పారు.

నెల్లూరు జిల్లాలో 2,87,970 మంది లబ్ధిదారులకు రూ.126 కోట్ల 14 లక్షల 96 వేల పింఛన్‌ మొత్తాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు.వంగల్లు గ్రామంలో 431 మంది లబ్ధిదారులకు రూ.20 లక్షల 4 వేల పింఛన్‌ మొత్తాన్ని అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. పేదలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందనే భరోసా కల్పించేందుకే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం ప్రతి నెలా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీపై లబ్ధిదారులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

వంగల్లు గ్రామంలో పింఛన్ల పంపిణీకి రావడంతో పాటు గ్రామంలోని సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి ఆనం హామీ ఇచ్చారు. మండలంలో రహదారుల అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని చెప్పారు. అలాగే దేవాదాయ శాఖ ద్వారా గ్రామంలోని దేవాలయాలకు నిధులు మంజూరు చేసి ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పావని , పీడీ నాగరాజ కుమారి,సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరి,రవీంద్రా రెడ్డి,టీడీపీ నాయకులు భీమేశ్వర స్వామి ఆలయం చైర్మన్ పగడాల రఘురామయ్య,టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులురెడ్డి,అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు,పాల్గొన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story