Nellore: అమెరికా యుద్దోన్మాదంతోనే ప్రపంచానికి ముప్పు.. హైదరాబాద్ సదస్సులో కీలక తీర్మానం!
Nellore: అమెరికా యుద్దోన్మాదం - ప్రపంచ శాంతి సవాళ్లు అంశంపై జట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సదస్సు వివరాలు.
Nellore: అమెరికా యుద్దోన్మాదంతోనే ప్రపంచానికి ముప్పు.. హైదరాబాద్ సదస్సులో కీలక తీర్మానం!
Nellore: అమెరికా యుద్దోన్మాదం ప్రపంచ శాంతి- సవాళ్లు" అనే అంశంపై సదస్సు మే 17వ తేదీ ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు జట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో శాంతి సంఘీభావ సంఘం రాష్ట్ర కన్వీనర్ యన్ సతీష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సులో శాంతి సంఘీభావ సంఘం(AIPSO) అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఆర్ అరుణ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ..
అమెరికా, ఇజ్రాయెల్ కలసి ఇరాన్ పై దాడి చేశారని, ఇరాన్ ప్రజలతోపాటు ఆ దేశ సుప్రీం ఖమేనీ భవనంపై దాడిచేసి, హత్యచేయడం, పాఠశాలలపై బాంబులువేసి పిల్లల్ని చంపడం సామ్రాజ్యవాద దురహంకారానికి పరాకాష్ట అన్నారు. పాలస్థినాపై ఇజ్రాయిల్ దాడి చేసి వేలాదిమంది మహిళలు, చిన్నారులు, అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకుందని, ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడులు ఐక్యరాజ్య సమితి నిబంధనావళిని, అన్ని అంతర్జాతీయ ఒప్పందాలను దారుణంగా ఉల్లంఘించడమే అని అన్నారు. అమెరికా ఇజ్రాయిల్ యుద్దోన్మాదం ఫలితంగా గల్ఫ్ దేశాలు మొత్తంగా యుద్ధ వాతావరణం నెలకొనడంతో పాటు , ప్రపంచవ్యాప్తంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ముఖ్యంగా ఆయిల్ , గ్యాస్ కొరత ప్రజలను ఇబ్బందులను గురి చేసిందని తెలిపారు.
ఇటీవల వెనిజులా అధ్యక్షుడు మదురోను, ఆయన భార్యను స్వంత నివాసం నుండే కిడ్నాప్ చేసి అమెరికాలో నిర్బంధించారని, ఆ దేశంలోని ఆయిల్ వనరులపై ఆధిపత్యం తమదేనని ట్రంప్ ప్రకటించడం ద్వారా, తన అసలు స్వరూపం ప్రదర్శించారు. అలాగే క్యూబా పై కూడా అమెరికా పలు బెదిరింపులకు పాల్పడుతోందని, గాజాపై నరహంతక దాడులు చేసి నరమేధం సృష్టించిన ఇజ్రాయెల్, శాంతి ఒప్పందం కుదిరిందని ప్రకటించాక కూడా గాజాపై దాడులు ఆపలేదని తెలిపారు.
ఇరాన్ పై దాడి అసలు లక్ష్యం గల్ఫ్ లో ఉన్న సహజ వనరులన్నింటినీ, స్వాధీనంలోకి తీసుకోవడం. అమెరికన్ సామ్రాజ్యవాదం చేసిన దురాగతాల ఫలితంగానే , ఉగ్రవాద సంస్థలు పుట్టాయని, నేడు వాటిని సాకుగా చూపి వివిధ దేశాలపై దాడులు చేస్తున్నదని చెప్పారు.
2003లో ఇరాక్ చేతిలో అణ్వస్త్రాలున్నాయని ఆరోపించి, ఆ దేశంపై దాడిచేసి, సద్దాం హుస్సేన్ ను చంపిన అమెరికా, ఇప్పుడు ఇరాన్ పై తిరిగి అదే తరహా దాడికి పూనుకుందని చెప్పారు. పశ్చిమాసియాలో అమెరికా వందలాది సైనిక స్థావరాలు నెలకొల్పి, తమకు నిరంతర ప్రమాదాన్ని సృష్టించడాన్ని ఇరాన్ వ్యతిరేకిస్తోందని చెప్పారు. అనేక దశాబ్దాలుగా ఇరాన్ లో తమ అనుకూల, తొత్తు ప్రభుత్వాన్ని నెలకొల్పుకునేందుకు అమెరికా పూనుకుందని చెప్పారు. తమకు లొంగని కారణంగానే ఇరాన్ పై ఈ దాడులకు ప్రస్తుతం పూనుకున్నారని చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు ప్రపంచ పోలీస్ గా వ్యవహరిస్తూ.. అన్ని దేశాలను బెదిరించడం, ప్రపంచంపై యుద్ధాన్ని రుద్దుతున్నాడని, ట్రంప్ బాధ్యతారాహిత్యం మాటలతో ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొంది అని అన్నారు.. ఈ పరిస్థితుల్లో యుద్దాలను వ్యతిరేకిస్తూ శాంతి కోసం ప్రజలందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు..
ఈ కార్యక్రమంలో డాక్టర్ రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల సూపర్డెంట్ నాగేశ్వరరావు, కీర్తి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం చైర్మన్ రాజగోపాల్, శాంతి సంఘీభావ సంఘం రాష్ట్ర కన్వీనర్ సుబ్బారావు, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు ఎండి చలపతి, యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి చలపతి, శర్మ, బార్ కౌన్సిల్ సభ్యులు ఎస్ అంకయ్య , ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్న, జిల్లా కార్యదర్శి నరేంద్ర మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.




