Sangam: అంగన్వాడీలకు ఏఐ (AI) స్క్రీనింగ్‌పై ప్రత్యేక శిక్షణ!
Sangam: నెల్లూరు జిల్లా సంగం మండలంలో అంగన్వాడీ కార్యకర్తలకు 'నవచేతన' శిక్షణా కార్యక్రమం.
Sangam: అంగన్వాడీలకు ఏఐ (AI) స్క్రీనింగ్‌పై ప్రత్యేక శిక్షణ!
సంగం: నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీ జన సంఘంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చిన్నారుల సమగ్ర అభివృద్ధి ఆరోగ్య పరిస్థితులపై అంగన్వాడి కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిడిఓ పి సునీలిత మాట్లాడుతూ చిన్నారుల సమగ్ర అభివృద్ధి ఆరోగ్య పరిస్థితులను సమర్థవంతంగా అంచనా వేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) ఆధారిత ఈసీడి స్క్రీనింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
నవచేతన కార్యక్రమం మీద 0నుండి 6 సంవత్సరాల పిల్లల్లో ఎదుగుదల పోషకాహార లోపాలు మానసిక రుగ్మతలు ఇతర ఆరోగ్య సమస్యలు ప్రారంభ దశలోనే గుర్తించి వారికి స్క్రీనింగ్ ద్వారా సేవలందించి ప్రారంభ దశలోనే వైకల్యాన్ని గుర్తించి పిల్లల యొక్క భవిష్యత్తుకు మంచి పునాది వేసే విధంగా అంగన్వాడీ కార్యకర్తలందరికీ శిక్షణలో తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పిల్లలు పుట్టినప్పటి నుండి ప్రారంభ దశలోనే వచ్చేటువంటి వైకల్యాల గురించి అంగన్వాడీ కార్యకర్తలుఏ విధంగా స్క్రీనింగ్ చేయాలి స్క్రీనింగ్ చేసిన తర్వాత గుర్తించిన వైకల్యాన్ని డాక్టర్ కి రెఫర్ చేస్తూ అవసరమైతే డైస్ కి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.
1000 రోజుల సంరక్షణ గురించి పిల్లలలో అభివృద్ధి చెందవలసిన ఐదు రకాల అభివృద్ధిలను గురించి స్థూల చలనం సూక్ష్మ చలనం భాష మేధా మరియు సామాజిక భావ ఉద్వేగ అభివృద్ధిల గురించి సూపర్వైజర్ , R. రమాదేవి Rosy Rechel MLHP గారు తెలియజేయడం జరిగింది,అంతేకాక mobile నందు screening పక్రియను గురించి Awws అందరికీ అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.




