Atmakur: అత్యవసర సమయాల్లో సీపీఆర్‌పై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి!

Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అభిరామ్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ కె.వి. శ్రావణ్‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సీపీఆర్‌పై అవగాహన సదస్సు, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 19 Aug 2026 7:17 PM IST
Atmakur
X

Atmakur: అత్యవసర సమయాల్లో సీపీఆర్‌పై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి!

ఆత్మకూరు: అత్యవసర సమయాల్లో సీపీఆర్‌ (కార్డియో పల్మనరీ రిససిటేషన్‌)పై ప్రతి ఒక్కరికీ కనీస అవగాహన ఉండాలని అభిరామ్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ కె.వి. శ్రావణ్‌కుమార్ సూచించారు. ఆయన ఆధ్వర్యంలో బుధవారం నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఎల్‌ఆర్‌పల్లిలో సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమంతో పాటు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ.. గుండెపోటు లేదా ఇతర కారణాలతో ఒక వ్యక్తి అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి శ్వాస తీసుకోలేని పరిస్థితి ఏర్పడినప్పుడు వెంటనే స్పందించడం ఎంతో కీలకమన్నారు. అటువంటి సమయంలో అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో పాటు వైద్య సిబ్బంది వచ్చేలోపు సీపీఆర్‌ అందించడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని వివరించారు. సీపీఆర్‌ ఎలా చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను ప్రజలకు ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు.

అనంతరం నిర్వహించిన వైద్య శిబిరంలో స్థానికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తపోటు, షుగర్‌ తదితర ఆరోగ్య సమస్యలను పరీక్షించి, అవసరమైన వారికి వైద్యుల సూచనలు అందించారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి వైద్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సమర్థవంతంగా స్పందించేందుకు అవకాశం ఉంటుందని అభిరామ్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, స్థానికులు, పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story