Nellore: ఏఎస్ పేటలో విషాదం: పిడుగుపాటుతో నర్సారెడ్డి (25) మృతి!

Nellore: నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం గుంపర్లపాడులో పిడుగుపాటుకు గురై నర్సారెడ్డి (25) అనే యువకుడు మృతి చెందాడు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 14 Sept 2026 6:55 PM IST
Nellore
X

Nellore: ఏఎస్ పేటలో విషాదం: పిడుగుపాటుతో నర్సారెడ్డి (25) మృతి!

నెల్లూరు: నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం గుంపర్లపాడు గ్రామ పొలాలలో పిడుగుపాటు కు గురై గ్రామానికి చెందిన నర్సారెడ్డి (25) అనే యువకుడు మృత్యువాత పడ్డాడు..పొలంలో మేతమేస్తున్న పశువులను తోలుకు వచ్చేందుకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఈదురుగాలుల కారణంగా పిడుగులు పడ్డాయి.

ఇతనికి సమీపంలో పిడుగు పడటంతో పిడుగుపాటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయాడు.. సమీపంలో ఉండే పశువుల కాపరులు వెంటనే వైద్యుని వద్దకు తీసుకువచ్చినప్పటికే చనిపోయినట్లు నిర్ధారించడంతో ఇంటికి తరలించి కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు.. కుటుంబ సభ్యులతోపాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)