Train Accident: స్కూల్ వ్యాన్‌పైకి దూసుకెళ్లిన రైలు.. ముగ్గురు మృతి!

Train Accident: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. క

Arun Chilukuri
Updated on: 17 July 2026 11:39 AM IST
Train Accident
X

Train Accident: స్కూల్ వ్యాన్‌పైకి దూసుకెళ్లిన రైలు.. ముగ్గురు మృతి!

Train Accident: పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం ముర్షిదాబాద్ జిల్లాలో ఒక పాఠశాల వ్యాన్‌ను ప్యాసింజర్ రైలు బలంగా ఢీకొట్టింది. కర్ణసువర్ణ రైల్వే క్రాసింగ్ వద్ద జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఇద్దరు పాఠశాల విద్యార్థులు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.

స్థానిక సమాచారం ప్రకారం.. నిమ్‌తీతా-కటవా మార్గంలో వెళ్తున్న ప్యాసింజర్ రైలు కర్ణసువర్ణ రైల్వే గేట్ వద్దకు వచ్చేసరికి ట్రాక్ తెరిచే ఉంది. అదే సమయంలో పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న వ్యాన్ పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన రైలు వ్యాన్‌ను బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాద తీవ్రతకు స్కూల్ వ్యాన్ పూర్తిగా నుజ్జునుజ్జయిపోయింది. ఘటనా స్థలానికి సంబంధించిన భీతావహ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఈ దుర్ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రైల్వే అధికారులు ఈ ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు. గేట్ కీపర్ నిర్లక్ష్యం ఉందా లేదా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story