BJP: బెంగాల్‌లో బీజేపీ సర్కార్.. మే 9న నూతన సీఎం ప్రమాణ స్వీకారం..
BJP: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక కొత్త శకం ప్రారంభం కాబోతోంది. మే 9వ తేదీన రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య అధికారికంగా ప్రకటించారు.
BJP: బెంగాల్‌లో బీజేపీ సర్కార్.. మే 9న నూతన సీఎం ప్రమాణ స్వీకారం..
BJP: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక కొత్త శకం ప్రారంభం కాబోతోంది. మే 9వ తేదీన రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య అధికారికంగా ప్రకటించారు. నోబెల్ పురస్కార గ్రహీత, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకుని ఆ పవిత్ర దినాన కొత్త ప్రభుత్వం కొలువుదీరడం విశేషం.
"రవీంద్రనాథ్ ఠాగూర్ ఆశీర్వాదంతో బెంగాల్‌లో అభివృద్ధి పథంలో కొత్త ప్రయాణానికి నాంది పలకడానికి ఈ తేదీని నిర్ణయించాం" అని సమీక్ భట్టాచార్య వెల్లడించారు. అయితే, రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టబోతున్నారనే విషయంపై పార్టీ అధిష్టానం ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తోంది.
ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం:
ఎన్నికల ఫలితాలకు సంబంధించిన అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు నేడు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్‌కు అందజేయనున్నారు.
బుధవారం: సీఈసీ (CEC) ఈ అధికారిక పత్రాలను గవర్నర్ ఆర్.ఎన్.రవికి సమర్పిస్తారు.
ముగియనున్న దీదీ పాలన: గవర్నర్ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం, ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసి రాజీనామా సమర్పించాల్సిందిగా కోరనున్నారు.
తాత్కాలిక సీఎం: కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే వరకు మమతా బెనర్జీ తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగుతారు.
దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న తృణమూల్ కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడుతూ, కమలం పార్టీ అధికార పీఠాన్ని అధిరోహించనుండటంతో దేశవ్యాప్తంగా బెంగాల్ రాజకీయాలపై ఆసక్తి నెలకొంది.




