UPSC CDS 2 ఫైనల్ రిజల్ట్ విడుదల.. 302 మంది ఎంపిక

UPSC CDS 2 ఫలితాలు విడుదల.. 302 మంది IMA, INA, AFAకు ఎంపిక, రిజల్ట్ PDF అందుబాటులో.

Ganesh
Published on: 30 March 2026 7:13 PM IST
UPSC CDS 2
X

UPSC CDS 2 ఫైనల్ రిజల్ట్ విడుదల.. 302 మంది ఎంపిక

Union Public Service Commission తాజాగా CDS 2 ఫైనల్ రిజల్ట్ 2025ను విడుదల చేయడంతో రక్షణ రంగంలో కెరీర్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు స్పష్టత వచ్చింది. ఈసారి మొత్తం 302 మంది ఎంపిక కాగా, అందులో 190 మంది Indian Military Academyకు, 85 మంది Indian Naval Academyకు, 27 మంది Air Force Academyకు వెళ్లే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇప్పుడు ఎంపికైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, అటెస్టెడ్ కాపీలను సంబంధిత రక్షణ విభాగాలకు సమర్పించాల్సి ఉంటుంది.

అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఖాళీల వివరాలు కూడా వెల్లడయ్యాయి. Indian Military Academyలో మొత్తం 100 పోస్టులు ఉన్నాయి, అందులో 13 పోస్టులు NCC ‘C’ సర్టిఫికేట్ (ఆర్మీ వింగ్) అభ్యర్థులకు రిజర్వ్ చేశారు. Indian Naval Academy (ఎజిమాలా, కేరళ)లో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్/హైడ్రో కోసం 26 పోస్టులు ఉండగా, అందులో 6 NCC ‘C’ (నేవల్ వింగ్), 2 హైడ్రో పోస్టులు ఉన్నాయి. Air Force Academy (హైదరాబాద్)లో 32 పోస్టులు ఉండగా, అందులో 3 పోస్టులు NCC ‘C’ (ఎయిర్ వింగ్) అభ్యర్థులకు ప్రత్యేకంగా కేటాయించారు.

రిజల్ట్ ఈ విదంగా చెక్ చేసుకోండి..

upsc.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేసి “Final Result: Combined Defence Services Examination (II), 2025” లింక్‌పై క్లిక్ చేస్తే PDF ఓపెన్ అవుతుంది.

అందులో మీ పేరు లేదా రోల్ నంబర్‌తో సెర్చ్ చేసుకుని ఫలితాన్ని తెలుసుకోవచ్చు.

Ganesh

Ganesh

2022లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 4 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. లైఫ్ స్టైల్, బిజినెస్‌, మూవీస్, స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా సినిమా గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story