విజయ్ విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్.. పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!

Vijay: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 7 Aug 2026 4:12 PM IST
విజయ్ విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్.. పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
X

విజయ్ విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్.. పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!

Vijay: తమిళనాడు రాజకీయాలు మరియు చిత్ర పరిశ్రమలో తీవ్ర సంచలనం సృష్టించిన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ విడాకుల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన సతీమణి సంగీత దాఖలు చేసిన పిటిషన్‌ను ఆమె ఉపసంహరించుకున్నారు.

విజయ్ నుంచి విడాకులు కావాలంటూ సంగీత ఈ ఏడాది ఫిబ్రవరిలో చెంగల్పట్టు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ పిటిషన్‌ను ఆమె వెనక్కి తీసుకోవడంతో, ఈ కేసుపై విచారణను అధికారికంగా ముగిస్తున్నట్లు చెంగల్పట్టు జిల్లా కోర్టు వెల్లడించింది.

ఇరువర్గాల మధ్య విభేదాలు తొలగిపోవడంతోనే సంగీత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ పరిణామంతో విజయ్ అభిమానులు మరియు మద్దతుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story