CM Joseph Vijay: ఆరోగ్య బీమా ₹25 లక్షలకు పెంపు.. ఎమ్మెల్యేలకు కార్లు.. సీఎం విజయ్ సంచలన ప్రకటనలు!
CM Joseph Vijay: తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ సంచలన నిర్ణయాలు ప్రకటించారు. ఆరోగ్య బీమా పరిమితిని రూ.25 లక్షలకు పెంపు చేయడంతో పాటు ఆవిన్ పాల సేకరణ ధరను రూ.41కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
CM Joseph Vijay: ఆరోగ్య బీమా ₹25 లక్షలకు పెంపు.. ఎమ్మెల్యేలకు కార్లు.. సీఎం విజయ్ సంచలన ప్రకటనలు!
CM Joseph Vijay: తమిళనాడు ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పలు కీలక ప్రకటనలు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం (CMCHIS) కింద లబ్ధిదారులకు అందే వార్షిక పరిమితిని రూ.5 లక్షల నుండి ఏకంగా రూ.25 లక్షలకు పెంపు చేస్తున్నట్లు సీఎం సి. జోసెఫ్ విజయ్ అసెంబ్లీలో అధికారికంగా వెల్లడించారు. ఆదాయంతో సంబంధం లేకుండా నాణ్యమైన వైద్యాన్ని రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా అందించాలనే సంకల్పంతో ఈ పెంపును చేపట్టినట్లు తెలిపారు.
దీంతో పాటు పాల ఉత్పత్తిదారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆవిన్ (Aavin) పాల సేకరణ ధరను లీటరుకు రూ.38 నుంచి రూ.41కి పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నప్పటికీ 3.16 లక్షల మందికి పైగా ఉన్న పాడి రైతులకు లబ్ధి చేకూరేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం పేర్కొన్నారు. అలాగే ఎమ్మెల్యేల నియోజకవర్గ పర్యటనల నిమిత్తం ప్రభుత్వ కార్లతో పాటు డ్రైవర్, ఇంధనం, మెయింటెనెన్స్ కోసం నెలకు రూ.75,000 ప్రత్యేక అలవెన్స్‌ను కేటాయించనున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు.




