అమ్మను నాన్న చంపేశాడు.. కొడుకుకి దొరికిన లేఖతో వెలుగులోకి షాకింగ్ మర్డర్!

Surat Crime: సూరత్‌లో భార్యను చంపి, మృతదేహాన్ని పెట్టెలో పెట్టి సిమెంట్‌తో కప్పిన భర్త ఉదంతం కలకలం రేపుతోంది. నిందితుడు రాసిన ఒక లేఖ ఆధారంగా పోలీసులు ఈ హత్యను ఎలా ఛేదించారో పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Arun Chilukuri
Published on: 27 April 2026 11:57 AM IST
Surat Crime
X

అమ్మను నాన్న చంపేశాడు.. కొడుకుకి దొరికిన లేఖతో వెలుగులోకి షాకింగ్ మర్డర్!

Surat Crime: గుజరాత్‌లోని సూరత్‌లో ఒక అత్యంత కిరాతకమైన హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసి డ్రామా ఆడిన ఓ భర్త.. చివరకు తను రాసిన చిన్న లేఖ కారణంగా అడ్డంగా దొరికిపోయాడు.

విశాల్ సాల్వి అనే వ్యక్తి, తన భార్య శిల్ప (39) నాలుగు రోజుల నుంచి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వృత్తిరీత్యా డైటీషియన్ అయిన శిల్ప కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే, ఇంట్లో వారి మైనర్ కుమారుడికి ఒక లేఖ దొరకడంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. "నేను పెద్ద తప్పు చేశాను.. శిల్ప ఇక బతికి లేదు" అని విశాల్ ఆ లేఖలో పేర్కొన్నాడు.

కుమారుడు ఈ లేఖను పోలీసులకు అందించడంతో వారు విశాల్‌కు చెందిన ఒక పాడుబడిన ఇల్లును తనిఖీ చేశారు. అక్కడ ఒక మూల ఉన్న చెక్క పెట్టె నుంచి దుర్వాసన రావడాన్ని గమనించారు. ఆ పెట్టెను తెరవగా.. లోపల శిల్ప మృతదేహాన్ని పచ్చి సిమెంట్‌తో కప్పి ఉన్న స్థితిలో పోలీసులు గుర్తించారు. శిల్పను హత్య చేసిన నాలుగు రోజుల తర్వాత విశాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడని తేలింది.

భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతోనే విశాల్ ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా, ప్రత్యేక బృందాలు అతని కోసం గాలిస్తున్నాయి. ఒక చిన్న లేఖ ఆధారంగా పోలీసులు ఈ మిస్టరీని ఛేదించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story