Sukhbir Singh Badal: శిరోమణి అకాలీదళ్‌ చీఫ్‌ సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై దాడి

Sukhbir Singh Badal: శిరోమణి అకాలీదళ్‌ (SAD) అధ్యక్షుడు, పంజాబ్‌ మాజీ ఉపముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ (Sukhbir Singh Badal)పై మహారాష్ట్రలోని నాందేడ్‌లో బుధవారం దాడి జరిగింది.

Arun Chilukuri
Published on: 13 Aug 2026 4:06 PM IST
Sukhbir Singh Badal
X

Sukhbir Singh Badal: శిరోమణి అకాలీదళ్‌ చీఫ్‌ సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై దాడి

Sukhbir Singh Badal: శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు, పంజాబ్‌ మాజీ ఉపముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ పై మహారాష్ట్రలోని నాందేడ్‌లో బుధవారం దాడి జరిగింది. స్థానిక గురుద్వారా సమీపంలో ఓ అపరిచిత వ్యక్తి పదునైన ఆయుధంతో ఆయనపై విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో బాదల్ కుడి చేతికి గాయమవ్వగా, వెంటనే ఆయన్ను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు.

దాడి జరిగిన సమయంలో సుఖ్‌బీర్ బాదల్ సతీమణి, అకాలీదళ్ ఎంపీ హర్‌సిమ్రత్‌ కౌర్ బాదల్ కూడా ఆయన వెంటే ఉన్నారు. అకస్మాత్తుగా జరిగిన ఈ దాడిలో బాదల్‌ను రక్షించే క్రమంలో ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి కూడా గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనతో నాందేడ్‌తో పాటు పంజాబ్‌లోనూ రాజకీయ సంచలనం వ్యక్తమవుతోంది.

సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై దాడి జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో 2024 డిసెంబర్‌లోనూ ఆయనపై దారుణ హత్యాయత్నం జరిగింది. అమృత్‌సర్‌లోని పవిత్ర స్వర్ణ దేవాలయం వెలుపల ఓ వ్యక్తి ఆయనపై పాయింట్ బ్లాంక్ పరిధి నుంచి కాల్పులు జరిపాడు. అయితే, బుల్లెట్ గురితప్పి పక్కకు వెళ్లడంతో బాదల్ తృప్తిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆ సమయంలోనూ నిందితుడిని పోలీసులు అక్కడికక్కడే అరెస్టు చేశారు. వరుసగా బాదల్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతుండటంపై అకాలీదళ్ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story