Sonam Wangchuk: "సోనమ్, ఇట్స్ డన్ బ్రో" వివాదంపై తొలిసారి నోరువిప్పిన సోనమ్ వాంగ్‌చుక్!

Sonam Wangchuk: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ చేసిన "సోనమ్, ఇట్స్ డన్ బ్రో" వైరల్ వ్యాఖ్యపై ప్రముఖ విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ తొలిసారిగా స్పందించారు.

Arun Chilukuri
Published on: 31 Aug 2026 10:19 AM IST
Sonam Wangchuk
X

Sonam Wangchuk: "సోనమ్, ఇట్స్ డన్ బ్రో" వివాదంపై తొలిసారి నోరువిప్పిన సోనమ్ వాంగ్‌చుక్!

Sonam Wangchuk: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గతంలో చేసిన "సోనమ్, ఇట్స్ డన్ బ్రో" అనే వైరల్ వ్యాఖ్యలపై ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తొలిసారిగా స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్య వెనుక ఉన్న భావనను గౌరవిస్తానని, సెలబ్రిటీలు ఎదుర్కొనే ఒత్తిళ్లను కూడా అర్థం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

"ప్రతి ఒక్కరికీ వారి వారి పరిమితులు, ఒత్తిళ్లు ఉంటాయి. అన్ని వైపుల నుంచి ఆలోచించాల్సి ఉంటుంది. కానీ ఆయన ఏది చెప్పినా నేను దానిని గౌరవిస్తాను" అని వాంగ్‌చుక్ హిందీలో తెలిపారు.

అసలేం జరిగింది?

గత జులైలో నీట్-యూజీ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణలపై విద్యార్థులు చేపట్టిన నిరసనలకు మద్దతుగా సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.

విద్యార్థులకు మద్దతు తెలిపిన సల్మాన్ ఖాన్.. ఆ తర్వాత రోజు దీక్ష విరమించాలని కోరుతూ, "సోనమ్, ఇట్స్ డన్ బ్రో" అంటూ ప్రత్యేకంగా పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఇంటి నుంచి వండిన ఆహారాన్ని పంపుతానని ఆఫర్ చేశారు. ఈ కామెంట్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయి పెద్దఎత్తున మీమ్స్‌కు దారితీసింది.

సల్మాన్ విజ్ఞప్తిని పక్కనపెట్టి వాంగ్‌చుక్ తన దీక్షను కొనసాగించారు. చివరకు ప్రభుత్వం తమ ప్రధాన డిమాండ్లను అంగీకరించడంతో ఆయన దీక్షను విరమించారు.

తాజాగా ఒక యూట్యూబ్ పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న వాంగ్‌చుక్‌కు నిర్వాహకులు "సోనమ్, ఇట్స్ డన్ బ్రో" అని రాసి ఉన్న టీ-షర్టును బహుమతిగా ఇవ్వడంతో ఈ విషయంపై ఆయన స్పందించారు. సెలబ్రిటీల ఒత్తిళ్లను అర్థం చేసుకుంటూనే, సల్మాన్ వ్యాఖ్యను గౌరవిస్తానని చెప్పడం ద్వారా వాంగ్‌చుక్ తన హుందాతనాన్ని చాటుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story