Lottery Jackpot: కానిస్టేబుల్‌కు రూ.7 కోట్ల లాటరీ జాక్‌పాట్
Lottery Jackpot: పంజాబ్‌కు చెందిన కానిస్టేబుల్ గుర్ప్రీత్ సింగ్‌కు లాటరీలో రూ.7 కోట్ల జాక్‌పాట్ దక్కింది.
Lottery Jackpot: కానిస్టేబుల్‌కు రూ.7 కోట్ల లాటరీ జాక్‌పాట్
Lottery Jackpot: పంజాబ్‌లో ఓ పోలీస్ కానిస్టేబుల్‌కు ఊహించని అదృష్టం వరించింది. లాటరీ బంపర్ డ్రాలో ఏకంగా రూ.7 కోట్ల ప్రైజ్‌మనీ గెలుచుకున్నాడు. ఫిరోజ్‌పుర్ జిల్లా మాల్వాల్ కదీమ్ గ్రామానికి చెందిన గుర్ప్రీత్ సింగ్ (28) ఈ జాక్‌పాట్ సొంతం చేసుకున్నాడు. 2022లో పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా చేరిన ఆయన ప్రస్తుతం 112 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నాడు.
ఇటీవల పని నిమిత్తం నగరానికి వెళ్లిన గుర్ప్రీత్ సింగ్.. ఉద్ధమ్ సింగ్ చౌక్‌లోని ఓ లాటరీ ఏజెన్సీ నుంచి టికెట్ కొనుగోలు చేశాడు. ఆ టికెట్ తన జీవితాన్నే మార్చేస్తుందని అప్పట్లో ఊహించలేదని చెప్పాడు. బంపర్ డ్రాలో తన టికెట్‌కు మొదటి బహుమతి వచ్చిందని తెలిసిన వెంటనే ఆనందానికి అవధులు లేకుండా పోయాయని గుర్ప్రీత్ సింగ్ తెలిపాడు.
రూ.7 కోట్ల జాక్‌పాట్ విషయం తెలియడంతో గుర్ప్రీత్ సింగ్ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఆయన స్వగ్రామంలోనూ సంబరాలు మొదలయ్యాయి. గుర్ప్రీత్ సింగ్ తండ్రి రైల్వే శాఖలో పనిచేసి పదవీ విరమణ చేసినట్లు సమాచారం. సాధారణ ఉద్యోగ జీవితం గడుపుతున్న కుటుంబానికి ఇంత భారీ లాటరీ మొత్తం రావడంతో ఈ ఘటన స్థానికంగా ఆసక్తికరంగా మారింది.




