Prajwal Revanna: పరప్పన అగ్రహార జైల్లో ప్రజ్వల్ రేవణ్ణ వద్ద ఫోన్, పెన్‌డ్రైవ్.. అధికారిపై సస్పెన్షన్ వేటు!

Prajwal Revanna: ఇంట్లో పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు.

Arun Chilukuri
Published on: 12 Aug 2026 12:07 PM IST
Prajwal Revanna
X

Prajwal Revanna: పరప్పన అగ్రహార జైల్లో ప్రజ్వల్ రేవణ్ణ వద్ద ఫోన్, పెన్‌డ్రైవ్.. అధికారిపై సస్పెన్షన్ వేటు!

Prajwal Revanna: ఇంట్లో పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న ఆయన వద్ద సెల్ ఫోన్, పెన్‌డ్రైవ్‌ను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

క్రైమ్ బ్రాంచ్ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ప్రజ్వల్ రేవణ్ణ తన దుస్తుల్లో రహస్యంగా ఆండ్రాయిడ్ ఫోన్ దాచుకున్నట్లు గుర్తించారు. ఆయన వద్ద నుంచి ఫోన్‌తో పాటు పెన్ డ్రైవ్, ఛార్జర్, ఒక డైరీ లభ్యమైనట్లు వెల్లడించారు. హై -ప్రొఫైల్ ఖైదీ వద్దకు ఎలక్ట్రానిక్ పరికరాలు ఎలా వచ్చాయనే దానిపై అధికారులు విచారణ వేగవంతం చేశారు.

విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఈరన్న రంగాపూర్‌ను ప్రభుత్వం తక్షణమే సస్పెండ్ చేసింది. భద్రతా లోపాలపై పూర్తి వివరణ ఇవ్వాలని జైలు సూపరింటెండెంట్ అనుష్ కుమార్ కు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. జైలు నిబంధనలు ఉల్లంఘించి ఎలక్ట్రానిక్ వస్తువులు పొందినందుకు ప్రజ్వల్ రేవణ్ణపై మరో కొత్త కేసు నమోదు చేశారు.

2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. పలువురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన ఆరోపణలు విచారణలో నిరూపణ కావడంతో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనవడైన ప్రజ్వల్ రేవణ్ణకు కోర్టు యావజ్జీవ శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story