PM Modi: బెజవాడ గాయని పాటకు మోదీ ఫిదా.. సోషల్ మీడియాలో పోస్ట్!

PM Modi: ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గా దేవి మహిమలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తున్నాయి.

Arun Chilukuri
Published on: 25 March 2026 12:01 PM IST
PM Modi
X

PM Modi: బెజవాడ గాయని పాటకు మోదీ ఫిదా.. సోషల్ మీడియాలో పోస్ట్!

PM Modi: ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గా దేవి మహిమలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తున్నాయి. విజయవాడకు చెందిన గాయని శ్రీలలిత ఆలపించిన భక్తి గీతాన్ని సాక్షాత్తూ దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో ఒక్కసారిగా ఈ పాట వైరల్‌గా మారింది.

విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన శ్రీలలిత ‘కనకదుర్గా మహా ప్రభావిత’ అనే తెలుగు పాటను అద్భుతంగా ఆలపించారు. ఈ పాట యూట్యూబ్ లింకును ప్రధాని మోదీ షేర్ చేస్తూ.."దుర్గాదేవిని ఆరాధించడం వల్ల మనసు అపారమైన శక్తిసామర్థ్యాలతో నిండిపోతుంది. ఈ భక్తి గీతం ఎంతో మధురంగా ఉంది" అని కొనియాడారు.

నగరవాసుల గర్వకారణం: ఎమ్మెల్యే సుజనా చౌదరి

ప్రధాని మోదీ స్పందనపై విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి హర్షం వ్యక్తం చేశారు. విజయవాడకు చెందిన మహిళా గాయని ప్రతిభను ప్రధాని గుర్తించడం నగరవాసులందరికీ గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. తెలుగు భక్తి సంస్కృతిని గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై ఉంచినందుకు ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. గాయని శ్రీలలితపై సంగీత ప్రియులు, భక్తులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story