PM Modi: పడుకోగానే 8 సెకన్లలో నిద్రపోతా.. సీక్రెట్ రివీల్ చేసిన ప్రధాని మోదీ!
PM Modi: కొత్తగా ఎన్నికైన ఎన్డీయే రాజ్యసభ ఎంపీలతో ప్రధాని మోదీ ప్రత్యేక సమావేశం.
PM Modi: పడుకోగానే 8 సెకన్లలో నిద్రపోతా.. సీక్రెట్ రివీల్ చేసిన ప్రధాని మోదీ!
PM Modi: నూతనంగా ఎన్నికైన ఎన్డీయే రాజ్యసభ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ పలు కీలక సూచనలు చేశారు. బుధవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు, కొత్తగా ఎన్నికైన ఎంపీలకు ప్రధాని తన నివాసంలో అల్పాహార విందు ఇచ్చారు. దాదాపు గంటపాటు సాగిన ఈ భేటీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సహా పలువురు ఎంపీలు పాల్గొన్నారు.
ఎంపీలందరూ వీలైనంత ఎక్కువ సమయం సభకే కేటాయించాలని, పార్లమెంట్లో 100 శాతం హాజరు ఉండేలా చూసుకోవాలని ప్రధాని ఆదేశించారు.
సభలో సొంత పార్టీ నేతల నుంచే కాకుండా, ప్రతిపక్ష ఎంపీల ప్రసంగాలు, వారి పనితీరులోని మంచి విషయాలను కూడా నేర్చుకోవాలని హితవు పలికారు.
తన రోజువారీ దినచర్య గురించి ఎంపీలు ప్రశ్నించగా ప్రధాని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను పడుకోగానే కేవలం 8 సెకన్లలోనే నిద్రలోకి జారుకుంటానని, రోజుకు కేవలం 3 గంటలు మాత్రమే నిద్రపోతానని చెప్పారు.
జీవితంలో అత్యుత్తమ ఫలితాలు సాధించాలంటే గతాన్ని ఆలోచించకుండా వర్తమానంలో జీవించడం చాలా ముఖ్యమని, అందుబాటులో ఉన్న సమయాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
విదేశీ పర్యటనలకు వెళ్లేటప్పుడు విమానం ఎక్కిన వెంటనే తాను చేరుకోవాల్సిన దేశపు కాలమానానికి తగినట్లుగా గడియారాన్ని సర్దుబాటు చేసుకుంటానని, దాంతో జెట్లాగ్ వంటి సమస్యలు లేకుండా ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తానని ఎంపీలకు వివరించారు.




