PM Modi Saptadhara Vision: మాన్యుఫ్యాక్చరింగ్ నుంచి యోగా వరకు.. భారత్ ప్రగతికి మోదీ 7 సూత్రాలు

PM Modi Saptadhara Vision: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి ప్రధాని మోదీ ‘సప్తధార’ రోడ్‌మ్యాప్ ప్రకటన.

Arun Chilukuri
Published on: 15 Aug 2026 12:15 PM IST
PM Modi Saptadhara Vision
X

PM Modi Saptadhara Vision: మాన్యుఫ్యాక్చరింగ్ నుంచి యోగా వరకు.. భారత్ ప్రగతికి మోదీ 7 సూత్రాలు

PM Modi Saptadhara Vision: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్) నిర్మాణానికి సంబంధించి ఒక సరికొత్త సమగ్ర ప్రణాళికను ఆవిష్కరించారు. దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ‘సప్తధార’ (శక్తికి ఏడు మూలస్తంభాలు) విజన్‌ను ఆయన ప్రకటించారు.

కరోనా లేదా ఇతర ప్రపంచ సంక్షోభాల తర్వాత కేవలం ఒక్క రంగానికే పరిమితం కాకుండా, సమగ్ర దృక్పథంతో (Holistic Approach) ముందుకు సాగితేనే భారత్‌ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోగలదని ప్రధాని ఉద్ఘాటించారు.

‘సప్తధార’ – ప్రధాని మోదీ ప్రకటించిన 7 మూలస్తంభాలు:

1. మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ (ఉత్పత్తి రంగానికి ప్రాణం):

ప్రాసెస్డ్ భాగాల నుంచి పూర్తిస్థాయి ఉత్పత్తుల వరకు మొత్తం సప్లై చైన్ భారత్ చేతుల్లోనే ఉండాలి. డిజైన్ నుంచి తయారీ వరకు ప్రపంచ గ్లోబల్ సప్లై చైన్‌కు భారత్ ఒక ప్రధాన కేంద్రంగా మారాలి.

2. వ్యవసాయం & ఆహార శుద్ధి

వ్యవసాయ రంగంలో విస్తృతమైన ‘ఫుడ్ ప్రాసెసింగ్’ విధానాలను తీసుకురావాలి. భారతీయ రైతుల ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్ తలుపులు తట్టేలా చర్యలు చేపట్టాలి.

3. సాంకేతికత & ఆవిష్కరణలు

భారత్ సాంకేతికతకు కేవలం మార్కెట్‌గానే కాకుండా, గ్లోబల్ హబ్‌గా ఎదగాలి. AI, క్వాంటం టెక్నాలజీ, స్పేస్, రోబోటిక్స్, డేటా సెంటర్లు మరియు UPI వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ప్రపంచాన్ని శాసించాలి.

4. గతిశక్తి (కనెక్టివిటీ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్)

దేశమంతటా అతుకులు లేని రవాణా సదుపాయాలు ఉండాలి. హైస్పీడ్ రైళ్లు, ఆధునిక ఎక్స్‌ప్రెస్ హైవేలతో నగరాలను అనుసంధానించాలి.

5. రక్షణ రంగంలో ఆత్మనిర్భరత

రక్షణ రంగంలో విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గించి, గ్లోబల్ సప్లయర్‌గా మారాలి. డ్రోన్ సిస్టమ్స్, హైపర్ సోనిక్ డిఫెన్స్ టెక్నాలజీలో భారత్ నాయకత్వం వహించాలి.

6. గ్రీన్ & బ్లూ ఎకానమీ

గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనం ద్వారా ‘గ్రీన్ జాబ్స్’ సృష్టించాలి. అలాగే, సుదీర్ఘ సముద్ర తీరప్రాంతాన్ని వాడుకుంటూ చేపల పెంపకం, కోస్టల్ టూరిజమ్, ఓషన్ టెక్నాలజీతో ‘బ్లూ ఎకానమీ’ని బలోపేతం చేయాలి.

7. ఇండియాస్ సాఫ్ట్ పవర్ (భారత సాంస్కృతిక బలం)

యోగా, ఆయుర్వేదం, విశ్వాస కేంద్రాలు, సాంప్రదాయ వైద్యం ద్వారా ప్రపంచస్థాయిలో భారత్‌పై నమ్మకాన్ని పెంచాలి. యోగా ఇప్పటికే భారత్‌ను ప్రపంచంతో అనుసంధానించే శక్తిగా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story