PM Modi: యువతకు మోదీ బంపర్ ఆఫర్.. కోటి మందికి ఉచిత AI శిక్షణ, ఆన్‌లైన్ కోచింగ్!
PM Modi: ఎర్రకోట స్పీచ్‌లో ప్రధాని మోదీ కీలక ప్రకటనలు. కోటి మంది యువతకు ఉచిత AI శిక్షణ, పోటీ పరీక్షల కోచింగ్. సప్తధార రోడ్‌మ్యాప్ ప్రకటన మరియు దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరికలు.
PM Modi: యువతకు మోదీ బంపర్ ఆఫర్.. కోటి మందికి ఉచిత AI శిక్షణ, ఆన్‌లైన్ కోచింగ్!
PM Modi Independence Day Speech: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ఎర్రకోటపై నుంచి ప్రసంగించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, దేశ యువతను లక్ష్యంగా చేసుకుని పలు సంచలనాత్మక పథకాలు, పిలుపులను ప్రకటించారు. పేద, మధ్యతరగతి విద్యార్థులపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా కోటి మంది యువతకు ఏఐ (AI) నైపుణ్యాలలో శిక్షణతో పాటు పోటీ పరీక్షలకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ అందించనున్నట్లు స్పష్టం చేశారు.
అలాగే దేశాభివృద్ధికి దిక్సూచిగా నిలిచే 'సప్తధార' (7 రంగాలు) రోడ్‌మ్యాప్‌ను ప్రకటించడంతో పాటు, 'దిమాగీ నక్సల్స్' సృష్టిస్తున్న ముప్పుపై మోదీ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
ప్రస్తుతం దేశంలో జరుగుతున్న జనగణన (Census) ప్రాధాన్యతను వివరిస్తూ ప్రధాని యువతకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు."యువత రోజుకు కనీసం గంట లేదా రెండు గంటల సమయం కేటాయించి జనాభా గణనపై అవగాహన కల్పించాలి. గణన అంటే కేవలం లెక్కలు రాయడం కాదు. ప్రజలు ఇచ్చే కచ్చితమైన వివరాల ఆధారంగానే జాతీయ విధానాలు, సంక్షేమ పథకాలు రూపుదిద్దుకుంటాయి. ప్రతి ఇంట్లో అనుకూల వాతావరణం ఏర్పడేలా యువత భాగస్వాములు కావాలి."
దేశ అంతర్గత భద్రతపై మాట్లాడిన ప్రధాని మోదీ, అర్బన్/దిమాగీ నక్సలిజంపై విరుచుకుపడ్డారు. "అడవుల్లోని సాయుధ నక్సల్స్‌ను విజయవంతంగా తుడిచిపెట్టాం. కానీ, సమాజాన్ని తప్పుడు మార్గంలోకి నడిపించేందుకు కుట్రలు పన్నుతున్న 'దిమాగీ నక్సల్స్' రూపంలో కొత్త శత్రువులు మిగిలి ఉన్నారు. వారు ఎత్తుగడలతో అవకాశం కోసం చూస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి సమాజం నుంచి ఏకాకిని చేయాలి" అని పిలుపునిచ్చారు.
'సప్తధార' విజన్ & మహిళా రిజర్వేషన్లు
సప్తధార రోడ్‌మ్యాప్: తయారీ (Manufacturing), వ్యవసాయం, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, రక్షణ రంగం, గ్రీన్ అండ్ బ్లూ ఎకానమీ మరియు ఇండియాస్ సాఫ్ట్ పవర్ అభివృద్ధికి 'సప్తధార' ప్రణాళికను ప్రకటించారు.
మహిళా బిల్లుపై పిలుపు: చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే మహిళా కోటా బిల్లు ఆమోదానికి ప్రతిపక్షాలు రాజకీయ విభేదాలను పక్కనపెట్టి సహకరించాలని కోరారు.




