PM Modi: ప్రధాని మోదీ రాజీనామా అంటూ ప్రచారం.. సంచలనం రేపుతున్న లేఖపై PIB స్పష్టత!

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేశారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖపై పిఐబి ఫ్యాక్ట్ చెక్ స్పష్టత ఇచ్చింది.

Arun Chilukuri
Published on: 30 July 2026 5:35 PM IST
PM Modi
X

PM Modi: ప్రధాని మోదీ రాజీనామా అంటూ ప్రచారం.. సంచలనం రేపుతున్న లేఖపై PIB స్పష్టత!

PM Modi: దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసనల అనంతరం సామాజిక మాధ్యమాల్లో ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని అనేక నకిలీ వార్తలు (Fake News) వైరల్ అవుతున్నాయి. వీటిని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వరుసగా ఖండిస్తూ వస్తోంది. అయితే తాజాగా, ప్రధాని నరేంద్ర మోదీ సంతకం చేసినట్లుగా ఉన్న ఒక లేఖ నెట్టింట తీవ్ర కలకలం రేపింది. ప్రధాని మోదీ తన పదవికి రాజీనామా చేశారంటూ ఆ లేఖను పలువురు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు.

ఈ తప్పుడు ప్రచారంపై కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ‘పీఐబీ ఫ్యాక్ట్‌చెక్’ (PIB Fact Check) తక్షణమే స్పందించి స్పష్టతనిచ్చింది. "ప్రధాని నరేంద్ర మోదీ సంతకం చేసినట్టుగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న లేఖ పూర్తిగా నకిలీ (Fake Letter). ప్రధానమంత్రి కార్యాలయం (PMO) లేదా ప్రధాని నుంచి అలాంటి ఎలాంటి రాజీనామా లేఖ జారీ కాలేదు. సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద ప్రచారాలను నమ్మడానికి ముందు అధికారిక మూలాల ద్వారా ధ్రువీకరించుకోవాలి" అని పీఐబీ ప్రజలను అప్రమత్తం చేసింది.

సందేహాలు ఉంటే ఈ నంబర్లను సంప్రదించండి:

నెట్టింట వైరల్ అయ్యే ఏవైనా సమాచారాలు లేదా లేఖలు అనుమానాస్పదంగా అనిపిస్తే, నిజానిజాలను తెలుసుకునేందుకు ప్రజలు నేరుగా తమను సంప్రదించవచ్చని పీఐబీ తెలిపింది.

వాట్సాప్ నంబర్: +91 8799711259

ఈ-మెయిల్ ఐడీ: [email protected]

అధికారికంగా ధ్రువీకరించని నకిలీ వార్తలను, లేఖలను వాట్సాప్ మరియు సోషల్ మీడియా గ్రూపులలో షేర్ చేయకూడదని హెచ్చరించింది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story