PIB Fact Check: విద్యార్థులను బెదిరిస్తున్నట్లు ప్రధాని మోదీ ఏఐ వీడియోలు.. పాకిస్థాన్ కుట్రను బయటపెట్టిన PIB!

PIB Fact Check: దిల్లీలో విద్యార్థుల ఆందోళనల వేళ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల పేరిట వైరల్ అవుతున్న వీడియోలపై పిఐబి ఫ్యాక్ట్ చెక్ స్పష్టతనిచ్చింది.

Arun Chilukuri
Published on: 25 July 2026 10:40 AM IST
PIB Fact Check
X

PIB Fact Check: విద్యార్థులను బెదిరిస్తున్నట్లు ప్రధాని మోదీ ఏఐ వీడియోలు.. పాకిస్థాన్ కుట్రను బయటపెట్టిన PIB!

PIB Fact Check: దేశ రాజధాని దిల్లీలో ఆందోళనలు చేపడుతున్న విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు మరియు ఆర్మీ ఉన్నతాధికారులు బెదిరింపు వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో (PIB Fact Check) తీవ్రంగా స్పందించింది. ఆ వీడియోలన్నీ పూర్తిగా నకిలీవని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో మార్ఫింగ్ చేసినవని స్పష్టం చేసింది.

దేశంలో జరుగుతున్న ఆందోళనలను ఆసరాగా చేసుకుని, ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు పాకిస్థాన్‌కు చెందిన కొన్ని సైబర్ నెట్‌వర్క్‌లు (Pakistani Handles) ఈ మార్ఫింగ్ వీడియోలను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నాయని పీఐబీ వెల్లడించింది. ప్రధాని గానీ, కేంద్ర మంత్రులు గానీ అలాంటి వ్యాఖ్యలు ఏవీ చేయలేదని స్పష్టం చేసింది.

ఒరిజినల్ వీడియోలను ఏఐతో మార్ఫింగ్ చేసి..

ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు హామీ ఇస్తూ ప్రధాని మోదీ గురువారం రాత్రి షేర్ చేసిన వీడియోను, అలాగే ఇటీవల పార్లమెంటు వెలుపల కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట్లాడిన వీడియోలను హ్యాకర్లు ఏఐ సాంకేతికత ద్వారా రీ-క్రియేట్ చేసి నకిలీ కంటెంట్‌గా మార్చినట్లు ఫ్యాక్ట్ చెక్ విభాగం గుర్తించింది.

ఫేక్ న్యూస్‌పై నిఘా – పీఐబీ విజ్ఞప్తి

సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రతికూల, అనుమానాస్పద కంటెంట్‌ను పుకార్లుగా భావించి ప్రచారం చేయవద్దని పిఐబి ప్రజలను కోరింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి ఫేక్ వార్తలు లేదా అనుమానాస్పద వీడియోలు కనిపిస్తే వెంటనే పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగానికి నివేదించాలని సూచించింది.

రిపోర్ట్ చేయడానికి:

వాట్సప్ నంబర్: +91 8799711259

ఇమెయిల్: [email protected]

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story